మహిళలు పొరపాటున కూడా ఆ ప్యాకెట్లు కొనొద్దు.. జస్ట్ రూ.6 అనుకోవద్దు, ఆ పౌడర్ చాలా డేంజర్.. పోలీసుల హెచ్చరిక

పీలో మహిళలకు హెచ్చరిక.. షాపుల్లో దొరికే ఆ పౌడర్ చాలా డేంజర్ అని తేలింది. తాజాగా నంద్యాల జిల్లాలో ఆ ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేయడం కలకలం రేపింది.


ఈ పౌడర్ చాలా డేంజర్ అని.. ఉపయోగించొద్దని సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలీసులు సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఇళ్ల ముందు మహిళలు పేడకు బదులుగా చల్లేందుకు సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఆ పౌడర్‌ను నీళ్లలో కలిపి ఇళ్ల ముందు చల్లుతున్నారు.. అయితే ఈ పౌడర్ చాలా డేంజర్ అంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను అమ్ముతున్న షాపులపై పోలీసులు దాడులు చేసి సీజ్ చేశారు.

సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లలో కెమికల్స్ ఉన్నాయని.. ఈ పౌడర్‌ను నీళ్లలో కలిపి ఇంటి ముందు ఆరోగ్యానికి ప్రమాదం.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వాటిని నిషేధిస్తు్న్నామన్న పోలీసులు తెలిపారు. ఈ మధ్య కాలంలో మహిళలు ఇళ్ల ముందు పేడ బదులుగా సౌభాగ్య ప్యాకెట్లు వాడుతున్నారని.. కొందరు మహిళలు క్షణికావేశంలో ఈ పౌడర్ తాగి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయంటున్నారు. ఈ పౌడర్ నీళ్లలో కలుపుకుని తాగడంతో ప్రాణాలు పోతున్నాయని చెబుతున్నారు. అందుకే ఈ ప్యాకెట్లు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తాజాగా కోవెలకుంట్లలో నిషేధిత సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను సీజ్ చేశారు. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

గత కొంతకాలంగా సౌభాగ్య పేరుతో కిరాణా షాపుల్లో దొరికే ప్యాకెట్లను మహిళలు కొనుగోలు చేస్తున్నారు. పేడకు బదులుగా అదే రంగులో ఉండేలా.. ఈ పౌడర్‌ను నీళ్లలో కలిపి ఇళ్ల ముందు చల్లుతున్నారు. అయితే పౌడర్ డేంజర్ అని.. దీనిని ఉపయోగించొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఈ సౌభాగ్య ప్యాకెట్ల అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సౌభాగ్య పౌడర్ వాడకం పెరిగిందని చెబుతున్నారు.. అయితే ఈ సౌభాగ్య పౌడర్ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.