తాజాగా అందాల ముద్దుగుమ్మ శ్రీలీల విశ్వంభర సెట్‌లో సందడి చేసింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని, చిరు అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం విశ్వంభర మూవీ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ క్రమంలో అదే స్టూడియోలో మరో షూటింగ్‌లో ఉన్న శ్రీలీల నటిస్తున్న మూవీ కూడా చిత్రీకరణ జరుగుతోంది. దీంతో తాను ఎంతగానో అభిమానించే హీరో, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా అదే సెట్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఈ అమ్మడు. వెంటనే విశ్వంభర సెట్‌కు వెళ్లి చిరంజీవిగారిని కలిసింది.
దీంతో చిరు శ్రీలీలతో కాసేపు మాట్లాడి, మహిళా దినోత్సవం సందర్భంగా తనను కలిసిన ఈ ముద్దుగుమ్మకు శాలువా కప్పి సత్కరించి దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బహుమతిగా బహుకరించారు. మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ ప్రత్యేకమైన బహుమతిని అందుకున్న శ్రీలీల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. తాను చిరుతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. విత్ ఓజీ.. వెండితెరపై మనం ఎంతో ఆదరించే శంకర్ దాదా ఎంబీబీఎస్, మెగాస్టార్ చిరంజీవిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఉమెన్స్ డే సందర్భంగా ఆయన ప్రత్యేక బహుమతినిచ్చారు. రుచికరమైన భోజనం ఏర్పాటుచేయడమే కాకుండా, స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.