LICలో వర్క్ ఫ్రం హోం జాబ్స్.. నెలకు 25 వేల జీతం.. అర్హులు వీరే

www.mannamweb.com


ఉద్యోగం ఒక వ్యక్తిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే యువత ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతుంటారు. కాగా దేశంలో రోజు రోజుకు నిరుద్యోగం ఎక్కువైపోతున్నది. ప్రతి యేట వేల సంఖ్యలో పట్టాభద్రులు బయటికొస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం హెవీ కాంపిటీషన్ ఉంది. నేటి రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సాధించడం గగనమైపోయింది. చిన్న జాబ్ అయిన సరే లక్షలాది మంది పోటీపడుతున్నారు. ఎలాగైన జాబ్ సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏళ్లకేళ్లుగా ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ను కొనసాగిస్తున్నారు. కాగా చదువు పూర్తైన వారు ఏదైనా జాబ్ దొరికితే బాగున్ను అని అనుకుంటుంటారు.

ఇంట్లో వాళ్లు కూడా ఏదైనా జాబ్ చూసుకోవచ్చుగదా ఖాళీగా ఇంకా ఎన్ని రోజులు ఉంటావు అంటూ చివాట్లు పెడుతుంటారు. ఇంట్లో వాళ్లతో తిట్లు పడలేక, బయట జాబ్ దొరకక సతమతమైపోతుంటారు నిరుద్యోగులు. మరికొంతమంది ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మంచి జాబ్ కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్కిల్స్ కూడా ముఖ్యం. ఇటీవలి కాలంలో పలు సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కల్పిస్తున్నాయి. ఎంచక్కా ఇంట్లో ఉండే పనిచేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. మరి మీరు కూడా వర్క్ ఫ్రం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ ఫ్రం హోం జాబ్స్ కు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హులు ఎవరంటే?

ఎల్ఐసీ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ఇంటి వద్ద ఉండే పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. తాజాగా ఎల్ఐసీ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కు ఇంటర్ పూర్తైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్కెటింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. అర్హులైన స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 25 వేల జీతం అందిస్తారు. ఈ జాబ్స్ కోసం అప్లికేషన్స్ ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్వూ ద్వారా ఎంపిక చేస్తారు.