Work From Home Survey : వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఏపీ ప్రభుత్వం సెన్సేషనల్ డెసిషన్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రతి రంగంలోనూ కొత్తకొత్త ఆలోచలనతో ముందుకెళ్తోంది.


శ్రీకారం చుడుతోంది. ప్రతి రంగంలోనూ కొత్తకొత్త ఆలోచలనతో ముందుకెళ్తోంది. “స్వర్ణాంధ్ర విజన్- 2047, బ్రాండ్ ఏపీ” లక్ష్యంగా దూసుకెళ్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఓ మంచి చేయాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు అర్హులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేందుకు తాజాగా చర్యలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మరింత విస్తరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి తాజాగా సర్వే చేపట్టింది. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సేకరిస్తున్నారు. టెక్నికల్ స్కిల్స్, విద్యార్హతలు సహా ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించిన వివరాలనూ తెలుసుకుంటున్నారు. అలాగే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై ఆసక్తి ఉందా, లేదా? అనే అంశాలనూ ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నవారి వివరాలు సైతం సేకరిస్తున్నారు. వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి?, వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వచ్చే సమస్యలు ఏంటి? అనే అంశాలనూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు సైతం ఏపీ సర్కార్ సిద్ధం అవుతోంది. ఒకే ప్రాంతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న 20 నుంచి 25 మందికి కలిపి సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రైవేటు భవనాలు అందుబాటులో ఉన్నాయా, లేదా? అనే అంశాన్నీ పరిశీలిస్తోంది. కాగా, మార్చి 10 వరకూ సర్వే చేసి అనంతరం డేటాను ప్రభుత్వానికి పంపనున్నారు ఉద్యోగులు.

సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత రాష్ట్ర యువతకు మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు సర్కార్ కృషి చేయనుంది. సర్వే అనంతరం ప్రముఖ కంపెనీలతో సమావేశమై వర్క్ ఫ్రమ్ హోమ్ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు రచించనుంది. ఈ మేరకు బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీ, స్పీడ్ ఇంటర్నెట్, తగిన వసతి కల్పనపైనా దృష్టి సారిస్తోంది. సర్వే తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఎక్కువ మంది ఆసక్తి చూపితే ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.