టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగడంతోతెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) (Telugu Film Chamber of Commerce) ఒకకీలకనిర్ణయంతీసుకుంది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మెలోకి వెళ్లింది . దీంతో నిర్మాతలు కూడా కార్మికులకు అంత మొత్తం చెల్లించలేమని తేల్చేశారు . బయట ఉన్న ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఇప్పటికే వర్కర్లకు ఎక్కువ చెల్లిస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు .
కార్మికుల వేతనాల పెంపువిషయంలో ఫిల్మ్ ఫెడరేషన్‌తగ్గకపోవడంతోనిర్మాతలుకూడాఒకనిర్ణయానికివచ్చారు. నిర్మాతలు కొత్త మార్గాలు అన్వేషించారు.ఇకనుంచి యూనియన్లతో సంబంధం లేకుండా నిర్మాతలేఒకనోటిఫికేషన్విడుదలచేసిఆసక్తికలిగినకొత్తవారినివర్క్లోకితీసుకోవాలనిఅనుకున్నారు. ఎంపికఅయినవారినిపనికితగినట్లు ట్రైయినింగ్ ఇచ్చిఉద్యోగంకల్పించాలనిచూస్తున్నారు.
మొత్తం 22 విభాగాలకుసంబంధించిఒకనోటిఫికేషన్విడుదలచేశారు. అందులోఎడిటింగ్, మేకప్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్, ఆర్ట్‌వర్క్, కొరియోగ్రఫీవంటివికూడాఉన్నాయి. ఆసక్తివున్నవారుధరఖాస్తు Atfpg.comచేసుకోవచ్చు. నిర్మాతఅశ్వీనిదత్కూడాఆనోటిఫికేషన్లింక్నేషేర్చేశారు. మీలోఎవరైనా ఔత్సాహిక నిపుణులు, కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ్యత్వం కోసం రూ.లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నైపుణ్యం ఉన్న కార్మికులకు పని కల్పించడమే తమ ధ్యేయమనివారుపేర్కొన్నారు.































