టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ల.. జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరిగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆ వెంటనే ‘నిశ్శబ్దం’ సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది అమ్మడు.అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే. ఇటీవల ‘ఘాటి’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
ఇదిలా గతంలో అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…బాలకృష్ణతో నటించడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని చెప్పి ఆయన అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. అనుష్క.. బాలయ్య సరసన ‘ఒక్క మగాడు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకు వైవి యస్ చౌదరి దర్శకత్వం వహించారు. 2008 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. దీనికి తోడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. దీంతో పాటు ఓ సాంగ్ లో బాలయ్యతో చేసిన అంగాంగ ప్రదర్శన అనుష్కను తీవ్ర విమర్శలు పాలు అయ్యేలా చేసింది. సినిమాలో తన క్యారెక్టర్ ఏంటో అసలు తెలుసుకోకుండా యాక్ట్ చేయడం తాను చేసిన అతిపెద్ద పెద్ద మిస్టేక్ అని చెప్పుకొచ్చింది.
































