మూడో ప్రపంచ యుద్ధం కన్ఫామ్డ్?

పరేషన్ రైజింగ్ లయన్ పేరు చెప్పి ఇరాన్ లో ఉన్న అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అటు ఇజ్రాయెల్ కి అయినా, అటు అమెరికాకు అయినా..


ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం. ఇందులో యుద్ధం గెలవడం, ఓడటం అనే విషయాల సంగతి తర్వాత. ఈ సమయంలో ఇజ్రాయెల్ వల్ల కానిది అమెరికా వల్ల అయ్యేది ఒక పని ఉంది!

అదే… ఇరాన్ లోని కీలక అణు శుద్ధి కేంద్రమైన “ఫోర్డో”ను ధ్వంసం చేయడం. అయితే.. అది భూమికి చాలా లోతున అత్యంత పటిష్టంగా నిర్మించబడి ఉంది. దీంతో.. దీన్నీ ధ్వంసం చేయడం అంత ఈజీ కాదని.. ప్రస్తుతం ఇజ్రాయెల్ వల్ల కూడా కాకపోవచ్చని అంటున్నారు. ఈ సమయంలో యూఎస్ ఎంట్రీ మేన్డేట్రీ అని చెబుతున్నారు. అందుకు ఓ బలమైన కారణం ఉంది.

భూ ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఏ క్షిపణులు అయినా ధ్వంసం చేస్తాయి కానీ… భూ ఉపరితలం నుంచి బాగా లోతుకు చొచ్చుకెళ్లి మరీ ధ్వంసం చేయడానికి ఉపయోగించేవే బంకర్ బస్టర్ బాంబులు. ఈ క్రమంలో అమెరికా వద్ద ప్రస్తుతం జీబీయూ-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబు ఉంది. ఈ బాంబులు ఒక్కొక్కటి 13,600 కిలోల బరువుంటాయి. దీంతో.. వీటితో యూఎస్ ఎంట్రీ కన్ఫాం అన్ని అంటున్నారు.

ఇరాన్ తో అంత ఈజీ కాదు!:

ఇజ్రాయెల్ క్షిపణులు ఇరాన్ లో అణు స్థావరాలను ధ్వంసం చేస్తూనే ఉంది. ఈ సమయంలో అమెరికా ఎంట్రీ కూడా ఉండొచ్చని అంటున్నారు. అయితే.. ఈ యుద్ధంలోకి నేరుగా అమెరికా ఎంట్రీ ఇస్తే.. ఇరాన్ తో అగ్రరాజ్యానికి కొన్ని ముప్పులు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… అటు యుద్ధ నౌకలతో పాటు పశ్చిమాసియాలోని పలు దేశాల్లో ఉన్న అమెరికా సైన్యం ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు.

వాస్తవానికి అమెరికా దాదాపు మూడు డజన్ల రీఫ్యూయిలింగ్‌ ట్యాంకర్లను ఇప్పటికే ఐరోపా దేశాలకు చేర్చింది. ఈ పరిస్థితుల్లో అమెరికాపై ప్రతిదాడి చేయాలంటే ఇరాన్‌ తన క్షిపణులను సుమారు 10,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా ప్రయోగించాలి. కానీ.. అంత సామర్థ్యం ఉన్న మిసైల్స్‌ ఇరాన్ వద్ద లేవు. అయితే దీనికి ప్రత్యామ్నాయ వ్యూహం ఇరాన్‌ వద్ద ఉందని.. అదే అమెరికాకు చెక్ మేట్ అని చెబుతున్నారు.

ఇందులో భాగంగా… ఇరాన్‌ కు మద్దతు ఉన్న హూతీలు.. ఇరాక్‌, సిరియాలోని సాయుధ ముఠాలు ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలపై దాడులు ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఇరాన్‌ కూడా హర్మూజ్‌ జలసంధిలో అండర్‌ వాటర్‌ మైన్స్‌ ను పెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

దీంతో ఇప్పటికే పర్షియన్‌ గల్ఫ్‌ లో స్థావరాల వద్ద ఉన్న అమెరికా యుద్ధ నౌకలు బయటకు వెళ్లే వీల్లేకుండా ఇరుక్కుపోతాయి. ఇదే సమయంలో… ఇరాక్‌, యూఏఈ, జోర్డాన్‌, సౌదీ అరేబియా, ఖతార్‌ లో ఉన్న సుమారు 40,000 మంది అమెరికా మిలిటరీ సిబ్బంది ప్రమాదంలో పడతారని చెబుతున్నారు. వీరిపై ఇరాన్ కు సపోర్ట్ చేసే ముఠాలు విరుచుకుపడొచ్చని అంటున్నారు.

అయితే…ఈ పరిస్థితులు అన్నీ అమెరికాకు తెలియనివి కావు. అయినప్పటికీ అగ్రరాజ్యం రంగంలోకి దిగితే… కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి తెర లేచినట్లే కన్ ఫాం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. దీంతో.. ఇప్పుడు ట్రంప్ తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంట నెలకొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.