Astro News: హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యం ఉంది. మహిళలు ప్రతిరోజు ఉదయమే తులసి పూజ చేయనిది ఏ పనిచేయరు. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కను ఉపయోగిస్తారు.
ప్రాచీన గ్రంథాల ప్రకారం శ్రీహరి, లక్ష్మీ దేవి తులసి మొక్కలో నివసిస్తారని నమ్మకం. తులసి మొక్క ఎక్కడుంటే అక్కడ శ్రీ హరి, లక్ష్మీదేవిల అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉండడం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని చెబుతారు.
తులసిని మనస్పూర్తిగా పూజిస్తే వారి ఇంటికి పేదరికం రాదు. తులసి ఒక వ్యక్తి పాపాన్ని నాశనం చేస్తుంది. ఒక వ్యక్తికి ఏదైనా చెడు బాధ ఉంటే అతడు క్రమం తప్పకుండా తులసి మొక్కకు నీటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మనిషి సమస్యలు తొలగిపోతాయి. ఒక వ్యక్తి ప్రతిరోజూ తులసికి నీటిని సమర్పిస్తే అతడి ఇంటి నుంచి నెగిటివ్ శక్తి శాశ్వతంగా తొలగిపోతుంది. దీనితో పాటు పాజిటివ్ శక్తి ప్రసారం అవుతుంది.
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం తులసికి నీటిని సమర్పించేటప్పుడు 11 సార్లు ఓం సుభద్రాయ నమః అని జపిస్తే ఎలాంటి ఆర్థిక సంక్షోభం అయినా తొలగిపోతుంది. అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వల్ల వారిపై సంపదలు కురుస్తాయి. అయితే ఆదివారం మాత్రం తులసి చెట్టును అస్సలు ముట్టుకోవద్దు.