భారత రైల్వేలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. రకరకాల బోగీలతో పాటు బోగీల మీద స్పెషల్ సింబల్స్ ఉంటాయి. వాటికి తరచుగా రైలు ప్రయాణాల్లో చూస్తున్నప్పటి, వాటి గురించి చాలా మంది ప్యాసెంజర్లుకు తెలియదు. ఇప్పుడు మనం ఓ స్పెషల్ సింబల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైలు చివరి బోగీ మీద ‘X’ గుర్తు ఎందుకు?
ప్రతి రైలుకు చివర బోగీ మీద ‘X’ అనే గుర్తు ఉంటుంది. ఈ గుర్తు ఉందంటే, ఆ రైలుకు అదే చివరి కోచ్ అని అర్థం చేసుకోవాలి. ఈ ‘X’ గుర్తును పసుపు రంగు రేడియం స్టిక్కర్ తో అతికిస్తారు. ఆ గుర్తు ఎప్పటికీ అలాగే ఉంటుంది. దానితో పాటు ఎరుపు లైట్ మీద ‘LV’ అని కాస్త చిన్న లెటర్స్ లో రాసి ఉంటుంది. దానికి అర్థం ‘లాస్ట్ వెహికల్’. దీనిని సాధారణంగా రైల్వే గార్డు కోచ్ కు యాడ్ చేస్తుంటారు. రైలు ఫ్లాట్ ఫారమ్ మీద ఉన్నప్పుడు లోకో పైలెట్లు ఈ ‘LV’ గుర్తును గమనిస్తారు.
ఇంతకీ రైలు చివరి బోగీ మీద ‘X’ గుర్తు ఎందుకు ఉంటుందంటే.. వెనుక ఒకవేళ అనుకోని పరిస్థితులలో ఒక రైలు వెనుక అదే ట్రాక్ మీద మరో రైలు వస్తే, దూరం నుంచి ‘X’ సింబల్ ఈజీగా కనిపిస్తుంది. ఒకదానికొకటి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉండదు. అంతేకాదు, రైలుకు ‘X’ సింబల్ కనిపించిందంటే ఆ రైలు బోగీలు అన్నీ సక్రమంగా వెళ్తున్నట్లు అర్థం. కొన్నిసార్లు ఆయా కారణాలతో రైలు బోగీలు విడిపోతుంటాయి. కొన్ని బోగీలు ఎక్కడో ఒకచోట ఆగిపోతాయి. ఇంజిన్ తో యాడ్ అయిన ఉన్న కోచ్ లు మందుకు వెళ్లిపోతాయి. ఆ టైమ్ లో రైలు వెనుj ‘X’ సింబల్ కనిపించదు. అప్పుడు రైల్వే సిబ్బంది అలర్ట్ అవుతారు. ప్రతి స్టేషన్ లో రైలు అక్కడి నుంచి వెళ్లే సమయంలో స్టేషన్ మాస్టర్ రైలు వెనుక బోగీ మీద ‘X’ సింబల్ ఉందా? లేదా? అని తప్పకుండా గమనిస్తారు. ఒకవేళ ఆ సింబల్ లేకపోతే వెంటనే సమీప రైల్వే స్టేషన్లకు సమాచారం అందిస్తారు.
ఇక మామూలుగా రైలు వెనుక ఉన్న సింబల్ ను ఇంగ్లీష్ అక్షరం ‘X’ అనుకుంటారు. బోలెడు ఇంగ్లీష్ అక్షరాలు ఉండగా ఎక్స్ ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశారు? అనే అనుమానం కలుగుతుంది. అయితే, ఇది అక్షరం కాదు, కేవలం క్రాస్ సింబల్ గా చూడాలని రైల్వే అధికారులు వెల్లడించారు. అంతేకాదు, ఈ సింబల్ లోకో పైలెట్ కు ఈజీగా కనిపించేలా ఉంటుందని రైల్వే సంస్థ ఫైనల్ చేసినట్లు తెలిపారు.
రాత్రి వేళలో ‘LV’ స్థానంలో రెడ్ లైట్
ఇక రాత్ర వేళ ‘LV’ అనేది వెనుక వచ్చే లోకో పైలెట్లకు కనిపించదు. అందుకే దాని స్థానంలో ఓ రెడ్ లైట్ వెలుగుతూ, ఆరిపోతూ ఉంటుంది. ఈ లైట్ ను చూసి రైలు ఆగి ఉందా? ముందుకు వెళ్తుందా? అనే విషయాన్ని తెలుసుకుంటారు.