షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌ ఇదే

www.mannamweb.com


చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షావోమిపై అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ అసలు ధర రూ. 41,999కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 45 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 22,999కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్స్‌ ఇక్కడితో ఆగిపోలేదు ప్రముఖ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 18,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక మీ పాత ట్యాబ్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 21,750 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన 2.8కే+ డిస్‌ప్లేను అందించారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ట్యాబ్‌ హైపర్‌ ఓస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ఈ ట్యాబ్ సొంతం.

ఇక షావోమీ ప్యాడ్‌ 6 ట్యాబ్ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో డాల్బీ విజన్‌ ఆట్మోస్‌, క్వాడ్‌ స్పీకర్స్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ట్యాబ్‌లో 8840 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు.