దిగ్గజ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా సరికొత్త కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులో మతిపోయే ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా ధర కూడా చాలా తక్కువనే ఉంది. అందువల్ల సామాన్యులు కూడా ఈ కారును సులభంగానే కొనొచ్చు. ఇంతకీ మహీంద్రా కంపెనీ ఏ కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది? దీని ధర ఎంత? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మహీంద్రా కంపెనీ తాజాగా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర అందుబాటులోనే ఉంది. రూ.7.49 లక్షల నుంచి ధర ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు.
ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ. అలాగే ఎక్స్‌యూవీ 300కు ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్. అప్‌డేటెడ్ డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ ప్రమాణాలు ఈ కొత్త కారులో ఉన్నాయి. ఈ కొత్త ఎస్‌యూవీ కారు బుకింగ్స్ మే 15 నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ పేర్కొంది. అటు మహీంద్రా డీలర్‌షిప్స్ వద్ద, ఇటు ఆన్‌లైన్‌లో ఒకేసారి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక కారు డెలివరీస్ మే 26 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ కారు డిజైన్ అదిరింది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారు వెనుక భాగంలో ఇన్‌ఫినిటీ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. దీంతో అదిరే లుక్ వచ్చింది.
మహీంద్రా కంపెనీ కొత్త కారులో వరల్డ్ క్లాస్ టర్బో ఇంజిన్స్ ఉన్నాయి. అదిరే పనితీరు దీని సొంతం. ఇందులో ఎంస్టాలియన్ టీజీడీఐ అండ్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతేకాకుండా ఈ ఎస్‌యూవీ లీటరుకు 20.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మ్యానువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇందులో 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంటుంది. కంపెనీ ఈ కారులో పరిశ్రమలోనే తొలిసారిగా స్కైరూఫ్ టీఎం, డ్యూయెల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, 65 వాట్ యూఎస్‌బీ ఫాస్ట్ చార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, 3 స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్, లెవెల్ 2 అడాస్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అంతేకాకుండా ఈ కారులో ట్విన్ హెచ్‌డీ స్క్రీన్స్ ఉంటాయి. హర్మన్ కార్డన్ ప్రీమియం ఆడియో సిస్టమ్ విత్ యాంప్లిఫయర్ అండ్ సబ్ ఊఫర్ ఉంటుంది. 360 డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, నాలుగు డిస్క్ బ్రేక్స్, మూడు పాయింట్ సీటు బెల్ట్ విత్ రిమైండర్స్, ఐఎస్‌వో ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్లు వంటివి కూడా ఉన్నాయి. ఈ కారు వివిధ వేరియంట్ల రూపంలో లభిస్తోంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.