వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీలోని ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని వైసీపీ అధిష్టాణం సస్సెండ్ చేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేర ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో నవీన్ నిశ్చల్ ప్రకటించారు.
ఆ కారణంతో పార్టీ అధిష్టాణం ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ సస్పెండ్ చేసిన ఇద్దరు నాయకులు చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు. అలాంటి వారిని సస్పెండ్ చేయడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ ఘోర ఓటమి తరవాత అధినేత జగన్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో క్యాడర్ తగ్గినప్పటికీ ఎవరైనా పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే సస్పెండ్ చేస్తున్నారు
































