రాయలసీమకు భారీ వర్ష సూచన..! తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

www.mannamweb.com


తెలంగాణలో మరో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఏపీ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. IMD తాజా బులెటిన్ లో ప్రకారం… ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవాళ, రేపు, ఎల్లుండి సీమ జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఇవాళ తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్ , సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడకక్కడ కురిసే అవకాశం ఉంది.

రేపు(సెప్టెంబర్ 4) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఎల్లుండి(సెప్టెంబర్ 5) నిజామాబాద్, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

సెప్టెంబర్ 6 నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది.