తక్కువ వ్యవసాయ ఖర్చులతో ఎక్కువ ఆదాయాన్ని పొందాలని చూస్తున్న రైతులకు మునగ సాగు ఒక అద్భుత అవకాశం. బంజరు భూమిలో కూడా పెరిగే ఈ మొక్కలు మీకు లాభాల వర్షం కురిపిస్తుంది.
ఇది ఏడాదికి రెండుసార్లు ఫలాలను ఇస్తుంది. మీరు మీ ఇంటి చుట్టూ ఉన్న స్థలంలోనూ ఈ మొక్కలు వేసుకుంటే.. మీకు రెట్టింపు ఆదాయం లభిస్తుంది. అంతేకాదు.. ఇది దాదాపు సున్నా పెట్టుబడితో గణనీయమైన లాభాలను అందిస్తుంది.
దీని మార్కెట్ ధర సాధారణంగా కిలోకు రూ.80 నుంచి 100, 150 వరకు కూడా ఉంటుంది. ఒక మొక్క ఆరు నెలల్లో 30 కిలోగ్రాముల దిగుబడిని ఇచ్చినా, మీరు ఎటువంటి ఖర్చు లేకుండా, కేవలం ఒక మొక్క నుండి సుమారు రూ.2,400 నుంచి రూ. 4,500 వరకు సంపాదించవచ్చు. మీకు 10 మొక్కలు ఉన్నాయంటే.. అది మీకు మరింత ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుంది.
పోషకాలతో సమృద్ధిగా ఉండే మునగ అమ్మడానికి సులభం. మునగ ఆదాయ వనరు మాత్రమే కాదు, పోషకాల నిధి కూడా. ఇది అత్యధిక ప్రోటీన్ కలిగిన కూరగాయలలో ఒకటి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇది దాదాపు ప్రతి ఇంట్లోనూ ఇష్టమైన కూరగాయ. అందుకే దీనికి అధిక డిమాండ్ ఉంది. ముఖ్యంగా, దీన్ని అమ్మడానికి మీరు ఎలాంటి మార్కెట్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్లి అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. స్థానికంగా దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇంటి నుండే సులభంగా అమ్ముకోవచ్చు. అందువల్ల, మునగకాయల సాగు రైతులకు, ప్రజలకు తక్కువ శ్రమతో అధిక లాభాలను సంపాదించడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.
































