మొటిమల సమస్యతో ఇబ్బందిపడుతున్నారా..? కలబందతో ఇలా చెక్‌ పెట్టొచ్చు..

www.mannamweb.com


ముఖం మెరుస్తూ మంచి నిగారింపుతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. ఇంటివారికి ఇంట్లోని పదార్థాలతో కలబందను యాడ్‌ చేసుకుని మంచి ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు.

మెరిసే ముఖం కోసం చిటికెడు పసుపు, ఒక చెంచాడు పాలు, కొంచెం రోజ్‌వాటర్, ఒక చెంచా తేనె పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమానికి కలబంద గుజ్జును కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం కాంతి వంతమవుతుందని సౌందర్య నిపుణలు సూచిస్తున్నారు.

చర్మం జిడ్డుగా ఉండేవారిలో మొటిమల సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అలాంటి వారు కలబంద ఆకుల్ని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు కొన్ని చుక్కల తేనె కలుపుకొని ముఖానికి బాగా పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖంపై తరచూ వచ్చే మొటిమలతో అమ్మాయిలు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. అయితే, మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కలబందకు మించింది లేదంటారు సౌందర్య నిపుణులు. అలా మెటిమల సమస్య ఉన్నచోట కలబంద గుజ్జులో రెండు చుక్కల గులాబీనూనె కలిపి ముఖానికి రాయాలి. కాసేపు అలానే వదిలేయాలి. ఇది చర్మానికి మంచి పోషణ అందిస్తుంది.

ఎక్కువగా ఎండకు గురైనప్పుడు చర్మంపై ట్యాన్‌ ఏర్పడుతుంది. దీనికి పరిష్కారం కోసం కొంచెం కలబంద గుజ్జును తీసుకొని అందులో టీస్పూన్‌ చొప్పున పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని సమస్య ఉండే ప్రాంతంలో రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల కేవలం ట్యాన్ మాత్రమే కాదు, ముఖంపై వచ్చే మొటిమలు కూడా తగ్గిపోతాయంటున్నారు నిపుణలు.