వాట్సాప్‌లో మీరే సొంతంగా GIF ఇమేజ్‌లు క్రియేట్ చేయచ్చు

www.mannamweb.com


వాట్సాప్ లో వ్యక్తులతో గానీ, గ్రూప్స్ లో గానీ చాట్ చేసే సమయంలో గిఫ్ ఇమేజ్ లు పంపించుకుంటూ ఉంటాం. అయితే సందర్భాన్ని బట్టి గిఫ్ ఇమేజ్ లని ఎంపిక చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు సందర్భానికి తగ్గట్టు గిఫ్ ఇమేజ్ లు దొరికి చావవు. ఇలాంటప్పుడే మనమే సొంతంగా క్రియేట్ చేసుకుంటే పోలే అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు సొంతంగా గిఫ్ ఇమేజ్ లని క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ లని క్రియేట్ చేసి వాటికి యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. గిఫ్ ఇమేజులని ఎలా క్రియేట్ చేయాలో? నచ్చిన వారికి ఎలా ఈ యానిమేటెడ్ ఇమేజులని పంపించాలో ఈ కథనంలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.

వ్యక్తులకు గానీ గ్రూప్ లో వ్యక్తులకు గానీ గిఫ్ ఇమేజ్ లు పంపాలనుకుంటే ముందుగా ఆ చాట్ విండోలోకి వెళ్ళాలి. వెళ్లిన తర్వాత అందులో పిన్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. డాక్యుమెంట్, కెమెరా, గ్యాలరీ, ఆడియో, లొకేషన్, పేమెంట్, కాంటాక్ట్, పోల్ పక్కన ఇమేజిన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఒక ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. మెటా ఏఐ లోగోతో కూడిన విండో ఓపెన్ అవుతుంది. ‘వాట్ డు యూ వాంట్ టూ ఇమేజిన్?’ అని కనబడుతుంది. మీరు ఏం ఊహించాలనుకుంటున్నారు అని అడుగుతుంది. దాని కింద టైప్ చేసే బాక్స్ లో ఇమేజిన్ అని రాసి ఉంటుంది. దాని పక్కన మీరు మీకు నచ్చిన ఇమేజ్ కి సంబంధించిన టెక్స్ట్ ని టైప్ చేయాలి.

ఉదాహరణకు మీరు నవ్వుతున్న మనిషి ఇమేజ్ కావాలని కోరుకున్నట్లైతే ‘లాఫింగ్ మ్యాన్’ అని టైప్ చేస్తే మీకు పైన ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత టైప్ బాక్సులో కుడి పక్క ఏరో గుర్తు ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ‘యానిమేట్’ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేస్తే యానిమేటెడ్ పిక్ జనరేట్ అవుతుంది. అంటే మనిషి నవ్వుతున్న పిక్ అన్న మాట. ఆ తర్వాత సెండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీరు పంపాలనుకున్న వ్యక్తికి వెళ్ళిపోతుంది. గ్రూప్స్ లో అయినా ఇదే ప్రక్రియ. ఈ ఫీచర్ ద్వారా మీరు రియల్ గిఫ్ ఇమేజెస్ ని పంపించుకోవచ్చు. మీరు ఎలాంటి ఇమేజెస్ ని అయినా ఊహించి జనరేట్ చేసుకోవచ్చు. ఒక మొసలి బైక్ డ్రైవ్ చేస్తున్న పిక్ కావాలి అని అడిగితే జనరేట్ అవుతుంది. దాని కోసం మీరు ‘క్రొకోడైల్ డ్రైవ్స్ బైక్’ అని టైప్ చేస్తే చాలు. ఒకవేళ ఇమేజ్ పట్ల మీరు సంతృప్తి చెందకపోతే కనుక ఎడమ వైపు ఉన్న రీజనరేట్ మీద ట్యాప్ చేస్తే వేరే ఇమేజ్ వస్తుంది. ఇలా మీరు ఎన్నో మ్యాజిక్ లు చేయవచ్చు. మీకు ఇమేజిన్ ఫీచర్ కనిపించకపోతే కనుక ప్లేస్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ అప్డేట్ చేసుకోండి.