మెంతులు. చూడ్డానికి చిన్నవే అయినా, రుచికి కొంచెం చేదుగా ఉన్నా, అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రాచీన ఆయుర్వేదం నుంచి ఆధునిక పరిశోధనల వరకు మెంతులతో ప్రయోజనాల పై ఎన్నో ఆధారాలు ఉన్నాయి.
ముఖ్యంగా రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో మెంతుల వినియోగంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగరు పేషెంట్లకు కొన్ని సూచనలు చేస్తున్నారు.
మెంతుల్లో ఉండే పీచు పదార్థం పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడానికి సాయపడు తుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమ స్యలను తగ్గిస్తుందంటున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మెంతుల్లో ఉండే ప్రొటీన్, పీచు, మెగ్నీషియం సమ్మేళ నం కండబలానికి ఎంతగానో సహకరిస్తుందంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసిన తర్వాత అలసి, గాయపడిన కండరాలు రిలాక్స్ అవ్వాలన్నా, గాయాల నుంచి తిరిగి వేగంగా కోలుకోవ టానికి మెంతులు సహకరిస్తాయి. మెంతులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె జబ్బు ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ప్రముఖ అధ్యయనం పేర్కొంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నానబెట్టిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయ ని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిలో ఉండే అధిక ఫైబర్, జీర్ణక్రియను నెమ్మదింప జేస్తుంది. దీనివల్ల ఆహారంలోని కార్బొహైడ్రేట్లు, గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదల వుతాయి. మెంతుల్లో ఉండే ‘హైడ్రాక్సిస్‌ల్యూసిన్ 4’ అనే అమైనో ఆమ్లం, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహించేలా చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రీడయాబె టిస్ ఉన్నవారు రోజుకు 10 గ్రాముల మెంతులు తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (NLM) అధ్యయనం పేర్కొంది. మెంతుల్లోని ప్రొటీన్, మెగ్నీషియం కండరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే వీటిని సరైన మోతాదులో తీసుకోవడం మంచిది.
































