Smart Phone వాడే వారు జాగ్రత్త! ఇలాంటి పనులు చేశారంటే జైలు శిక్ష తప్పదు

www.mannamweb.com


నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. అసలు స్మార్ట్ ఫోన్ అందరికీ నిత్యవసరం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ వలన ప్రపంచంలో జరిగే విషయాలన్నీ మన కళ్ల ముందుకు వచ్చేస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్‌ అనేది ఎన్నో రకాల ఫీచర్లతో వచ్చేస్తుంది. మనకు సంబంధించిన చాలా పనులు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ తో కావలసినంత వినోదం కూడా లభిస్తుంది. అందుకే ఉదయం నుంచి రాత్రి దాకా అందరూ ఈ స్మార్ట్‌ఫోన్‌లోనే మునిగి తేలుతున్నారు. బ్యాంకు పనుల నుంచి వివిధ రకాల దరఖాస్తులు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల పనులు స్మార్ట్‌ ఫోన్‌లో చేసుకునే వెసులు బాటు వచ్చేసింది. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లోనే స్మార్ట్‌ ఫోన్‌లోనే సులభంగా తెలుసుకోవచ్చు. ఇలా ఫోన్లో అనేక రకాల మంచి పనుల చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ అనేది అంతటి వైజ్ఞానిక అద్భుతం.

అయితే ఈ కాలంలో చాలా మంది కూడా స్మార్ట్ ఫోన్ ని అనేక రకాల చెడు పనుల కోసం కూడా వాడుకుంటున్నారు. ఫోన్‌లో దేని గురించి అయినా సెర్చ్‌ చేస్తే క్షణాల్లో సులభంగా కళ్ల ముందుంటుంది. అందుకే చాలా మంది చెడు పనులకు కూడా వాడుతున్నవారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి వారు చాలా ఎక్కువై పోయారనే చెప్పవచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని దాని ద్వారా అనేక రకాల తప్పుడు కార్యకలాపాలు చేస్తున్నారు. వారు చేసే పనులు గురించి ఎవరికీ ఏమీ తెలియదని భావిస్తున్నారు. చట్ట విరుద్ధమైన పనులని చేస్తున్నారు. అయితే మీరు కూడా మీ ఫోన్‌లో ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేస్తే కచ్చితంగా కఠిన శిక్షలు తప్పవు. మీరు జైలుకు కూడా వెళ్లవచ్చు. మరి ఫోన్‌లో ఎలాంటి పనులు చేయకూడదో పూర్తిగా తెలుసుకుందాం.

చాలా మంది చాలా సులభంగా చేస్తున్న పని ఎలాంటి అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయడం. ఇది గోప్యత ఉల్లంఘన. ఇంకా పెద్ద నేరం కూడా. ఈ నేరం చేస్తే జైలుకు వెళ్లే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఈ పని వలన తీవ్రమైన పరిణామాలు తప్పవు. అందుకే ఫోన్‌లో ఇలాంటి పని పొరపాటున కూడా చేయకండి. చాలా మంది పైరసీ సినిమాలను చాలా ఈజీగా డౌన్‌లోడ్ చేయడం, లేదా ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. ఇది చట్టవిరుద్ధం. ఇలా చేస్తే జైలు శిక్షతో పాటు లక్షల రూపాయల జరిమానాని కూడా విధిస్తారు. మీరు పోరాపాటున కూడా గూగుల్‌లో బాంబు తయారీ విధానం గురించి తెలుసుకోవద్దు. అలా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గూగుల్‌ అటువంటివి సెర్ఛ్ చేస్తే మీ సమాచారాన్ని భద్రతా ఏజెన్సీలని ఇవ్వవచ్చు. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమని, అందుకు కచ్చితంగా 3 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల అశ్లీల చిత్రాలను చూడటం పోక్సో చట్టం ప్రకారం అతి పెద్ద నేరంగా పరిగణించబడుతుంది.