గీజర్, హీటర్ ఇలా వాడితే.. కరెంట్ బిల్లు తక్కువ

శీతాకాలం వచ్చేసింది. చాలా మంది ఇళ్లలో గీజర్లు, హీటర్లు అధికంగా ఉపయోగిస్తారు. వీటి వల్ల అధిక విద్యుత్ వినియోగమవుతుంది. దాంతో విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతాయి.


అయితే గీజర్లు, హీటర్లను ఉపయోగించే సమయంలో విద్యుత్‌ను ఆదా చేయడం ద్వారా బిల్లులు తక్కువగా వస్తాయి. ఏ విధంగా ఆదా చేయవచ్చునంటే..

గీజర్ వాడకానికి సూచనలు..

  • గీజర్లు.. అత్యధిక విద్యుతును వినియోగించే ఉపకరణం.. దీనిని జాగ్రత్తగా వాడాలి.
  • గీజర్‌లోని ధర్మోస్టాట్‌ను చాలా ఎక్కువగా అమర్చకుండా చూసుకోవాలి. నీటిని అధిక ఉష్టోగ్రతలతో వేడి చేయండం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో 50 నుంచి 55 డిగ్రీల సెల్సియస్ మధ్య దీనిని అమర్చాలి.
  • గీజర్‌ను కనీసం.. ఏడాదికి ఒకసారి అయినా సర్వీసింగ్ చేయించాలి. అలాగే ట్యాంక్‌లో ధూళి, స్కేల్ హీటింగ్ ఎలిమెంట్‌ను దెబ్బతీస్తాయి. దీంతో విద్యుత్ వినియోగం అధికమవుతుంది.
  • గీజర్‌ను నిరంతరం ఆన్‌లో ఉంచవద్దు. స్నానానికి 10 నుంచి 15 నిమిషాల ముందు ఆన్ చేయాలి. ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయాలి. గీజర్ నిరంతరం ఆన్‌లో ఉంచడం వల్ల వేడి నీరు చల్లబడుతుంది. పదే పదే మళ్లీ వేడి చేయడం వల్ల విద్యుత్ వృధా అవుతుంది.
  • మీ గీజర్‌లో టైమర్ ఉంటే.. అవసరమైనప్పుడు మాత్రమే అది నడుస్తుందని నిర్దారించుకోవడానికి దాన్ని ఉపయోగించాలి.
  • మీ కుటుంబ వాస్తవ అవసరాల ఆధారంగా గీజర్ సామర్థ్యాన్ని ఎంచుకోవాలి. కుటుంబ సభ్యుల తక్కువ మంది ఉంటే.. చిన్న గీజర్ తీసుకోవాలి. అందువల్ల విద్యుత్ వినియోగం తక్కువ ఉంటుంది.
  • గీజర్‌ను మళ్లీ ఆన్ చేసే ముందు.. ట్యాంక్‌లో ఇంకా వేడి నీరు మిగిలి ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంటి బాత్‌రూమ్‌లోని పంప్ తిప్పి.. నీటికి కిందకు వదలాలి.

రూమ్ హీటర్ వాడకానికి చిట్కాలు..

  • మీ హీటర్‌లో థర్మోస్టాట్ ఉంటే.. దానిని ఉపయోగించాలి. ఇది గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది అవసరమైనప్పుడు హీటర్‌ను ఆన్, ఆఫ్ చేస్తుంది. ఇది విద్యుత్‌ను ఆదా చేస్తుంది.
  • గది లోపల వేడిని ఉంచడానికి, హీటర్ ఎక్కువసేపు పని చేయవలసిన అవసరాన్ని తగ్గించడానికి హీటర్‌ను ఆన్ చేసి ముందు కిటికీలు, తులుపులు మూసివేయాలి.
  • హీటర్ నిరంతరం నడపకుండా ఉండాలి. గది వెచ్చగా అయిన తర్వాత దానిని ఆపి వేయాలి.
  • హీటర్‌ను ప్రధానంగా చిన్న, మూసివేసిన గదులలో వాడాలి. తద్వారా వేడి త్వరగా పెరుగుతుంది. హీటర్‌ను త్వరగా ఆపి వేయవచ్చు.
  • ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల.. గీజర్లు, హీటర్లు ఉపయోగించినా.. విద్యుత్ బిల్లులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.