మీ కళ్లు చెబుతాయి.. మీకు ఈ వ్యాధులు ఉన్నాయని

www.mannamweb.com


శరీరంలో తలెత్తే అనారోగ్య సమస్యలను మనకు శరీరం ముందుగానే అలర్ట్‌ చేస్తుంది. అందుకే ఏదైనా అనారోగ్య సమస్యతో వైద్యుడి వద్దకు వెళ్లగానే మొదటి డాక్టర్‌ కళ్లను పరీక్షించేంది అందుకే.

ఇంతకీ కళ్లను ఆరోగ్య పరిస్థితి ఎలా అంచనా వేయొచ్చు.? అసలు ఆరోగ్యానికి, కళ్లకు మధ్య సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా కంటి వెనకాల రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. దీనినే రెటీనా వాస్కులేచర్‌ అంటారు. ఇది మీ గుండె ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. దీంతో కంటి ఆరోగ్యాన్ని బట్టి గుండె పనితీరును అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. కంటి లోపలి భాగాలను పరిశీలించడం ద్వారా వైద్యులు ఈ విషయాన్ని అంచనా వేస్తారు. కంటి లెన్స్ రెటీనా, ఆప్టిక్‌ నరాల వంటి వాటిని పరిశీలించడానికి ఆప్తోల్మోస్కోపిన్‌ను ఉపయోగిస్తారు.

ఒకవేళ అధిక కొలెస్ట్రాల్‌ సమస్య ఉంటే కనుపాట చుట్టూ బూడిద రంటు లేదా నీలం రంగు వృత్తం ఏర్పడుతుంది. వైద్య భాషలో దీనిని ఆర్కస్ సెనిలిస్ అంటారు. దీన్ని బట్టి మీకు గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇక కళ్ల రక్తనాళాలు దెబ్బతినడం కనిపించినట్లయితే, అది అధిక రక్తపోటు సమస్యకు సంకేతమని నిపుణులు చెబుతారు.

ఈ సమస్యలో, కళ్ల చుట్టూ వాపు మొదలవుతుంది, దీనితో పాటు చర్మం కూడా కొద్దిగా కుంచించుకుపోయినట్లు కనిపిస్తుంది. కళ్ల చుట్టూ కనిపించే ఈ లక్షణాలు స్ట్రోక్, గుండెపోటుతో పాటు అధిక రక్తపోటుకు సంకేతంగా చెబుతుంటారు. ఒకవేళ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. కళ్ళు ఎర్రగా మారుతాయి. అంతేకాకుండా, కళ్ల చుట్టూ దురద సమస్య కూడా ఉంటుంది. అలాగే కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతంలో వాపు కూడా థైరాయిడ్ సమస్యను సూచిస్తుందని నిపుణులు అంటున్నారు.