రిటైల్ స్టోర్లలో మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నారా ? ఇకనుంచి అలా చెల్లదు

కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల మొబైల్ నెంబర్ల(Commercial Mobile Numbers) కు రక్షణ కల్పించేందుకు ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ చట్టాన్ని అమలు చేయనుంది.


ఈ కొత్త యాక్ట్ ప్రకారం.. డీమార్ట్, రీలయన్స్ లాంటి రిటైల్ స్టోర్లలో, ఇతర దుకాణాల్లో కస్టమర్లు బిల్లింగ్ చేసేటప్పుడు తమ మొబైల్ నెంబర్ చెప్పడం నిషేధం. ఇప్పటికే అనేక రిలైట్ కంపెనీలు లక్షలాది మంది కస్టమర్ల మొబైల్ నెంబర్లను సేకరించాయని,వాటిని డబ్బు కోసం ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కస్టమర్ల మొబైల్ నెంబర్లను రక్షించేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురానుంది.

ప్రస్తుతం చూసుకుంటే రిటైల్ కంపెనీ(Retail Stores) సిబ్బంది, ఇతర దుకాణదారులు కస్టమర్లకు బిల్లు వేసేటప్పుడు తరచుగా వారి మొబైల్ నెంబర్లు అడుగుతుంటారు. దీంతో ఈ స్టోర్లకు వచ్చే కస్టమర్లు అందరూ కూడా వారి మొబైల్ నెంబర్లు చెప్పేస్తుంటారు. అయితే త్వరలో రాబోయే కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం(New Data Protection Act) కింద ఇలా కస్టమర్లను మొబైల్ నెంబర్లు అడగడం తప్పనిసరి కాదు. దీనికి బదులుగా కస్టమర్ల ప్రైవేసీని కాపాడేందుకు కీప్యాడ్ ఎంట్రీ వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అమలుచేయవచ్చని తెలుస్తోంది.

ఈ యాక్ట్ ప్రకారం.. కస్టమర్లు ఒకవేళ మొబైల్ నెంబర్ చెప్పాలనుకుంటే వాళ్లకి కంపెనీలు జవాబుదారీతనంగా ఉండాలి. ఎందుకు మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు ? ఎంతకాలం అది వారి వద్ద ఉంటుంది ? ఎప్పుడు డిలీట్ చేస్తారనేది తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ చెప్పడానికి నిరాకరించినా కూడా రిటైల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల్లో బిల్లులు వేయాలి. భౌతిక రసీదులు ఇవ్వడం లేదా ఈమెయిల్ రసీదులు పంపించడం లాంటి మార్గాలను అనుసరించాలి. అలాగే కస్టమర్లు నుంచి సేకరించిన డేటాను ఆయా రిటైల్ కంపెనీలు ఇతర సంస్థలకు అమ్మడంపై నిషేధం ఉంటుంది.

అంతేకాదు బేసిక్ విజిటర్ ఎంట్రీ సిస్టమ్స్ వద్ద కూడా కస్టమర్లకి తమ మొబైల్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు ? అలాగే వారి డేటాను దుర్వినియోగం చేయామనే హామీ ఇవ్వాలి. అయితే ఈ కొత్త చట్టాన్ని రిటైల్ కంపెనీల వ్యాపారాలకు అంతరాయం కలిగించేందుకు కాదని.. జవాబుదారీతనం కోసమే తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు. కస్టమర్ల నుంచి డేటాను సేకరించేందుకు సరైన కారణం చెప్పి.. ఆ తర్వాత డిలీట్ చేస్తామని, వారి డేటాను దుర్వినియోగం చేయమని హామీ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంటున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద రిటైల్ కెంపెనీలు ఈ కొత్త రూల్స్ పాటించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ చట్టాన్ని విసిటర్ ఎంట్రీ సిస్టమ్స్ అలాగే హౌసింగ్ సొసైటీలకు కూడా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.