యూట్యూబ్ అనే పేరు తెలియని వారు ప్రస్తుతం ఎవ్వరూ ఉంటారు. ఏ విషయం కావాలన్నా, సమాచారం తెలుసుకోవాలన్నా, వింతలు విశేషాలు చూడాలన్నా ఈ ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలో చాలా సులభంగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ తప్పనిసరిగా ఉండాల్సిందే. యూట్యూబ్ కూడా తమ యూజర్లకు అనేక సేవలు అందిస్తూ ముందుకు దూసుకుపోతోంది. యూట్యూబ్ కొత్త పాజ్ యాడ్స్ అనే కొత్త అడ్వర్టైజింగ్ ఫీచర్ ను తీసుకువచ్చింది. యూజర్లను వీడియోను పాజ్ చేసినప్పుడు ప్రకటనలు వచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ విషయాన్ని యూట్యూబ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ఒలువా ఫలోడున్ వెల్లడించారు. కొత్త ప్రకటన ఫార్మాట్ తో యూజర్లకు తక్కువ ప్రకటన అంతరాయం కలుగుతుందన్నారు.
ప్రకటనదారుల ఆసక్తి
ఈ కొత్త పాజ్ యాడ్ ఫీచర్ తీసుకురావడానికి యూట్యూబ్ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా ప్రకటన దారులు దీనిపై ఎంతో ఆసక్తి కనబరిచారు. ముందుగా 2023లో కొందరు ప్రకటనదారులతో దీన్ని పరీక్షించారు. వారందరికీ నుంచీ ఈ పాజ్ యాడ్ ఫీచర్ ను మంచి స్పందన లభించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
యూజర్ల ఫీడ్ బ్యాక్
ప్రకటనదారులతో పాటు యూజర్ల ఫీడ్ బ్యాక్ ను కూడా యూట్యూబ్ తీసుకుంది. వారికి కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. ఈ కొత్త యాడ్ ఫార్మాట్ తో యూజర్లకు తక్కువ అంతరాయ అనుభవం కలుగుతుందని చెబుతున్నారు. యూట్యూబ్ గతేడాది అనేక ప్రకటన ఫార్మాట్లతో ప్రయోగాలు చేసింది. వాటి ద్వారా రకరకాల విధానాలను పరీక్షించింది. వీటిలో ఎక్కువ కాలం దాటవేయలేని ప్రకటనలు, బ్రాండెడ్ క్యూ ఆర్ కోడ్లు, లైవ్ వీడియోల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ యాడ్‌లు ఉన్నాయి. వీడియో ప్లేబ్యాక్‌లో పాజ్‌ల సమయంలో కూడా డబ్బు ఆర్జించడానికి యూట్యూబ్ అమలు చేస్తున్న వ్యూహమే పాజ్ యాడ్‌లు సరికొత్త ఆవిష్కరణగా చెబుతున్నారు.
ప్రీమియం యాడ్ ఫ్రీ ఆప్షన్
ఈ ప్రకటనలను నివారించాలనుకునే దేశంలోని యూజర్లకు ప్రీమియం యాడ్ ఫ్రీ ఆప్షన్ కూడా అందజేస్తుంది. 2024 సెప్టెంబర్ నాటికి వాటి ధరలు ఈ కింద తెలిపిన విధంగా ఉన్నాయి. వ్యక్తిగత ప్లాన్ కోసం నెలకు రూ.149, కుటుంబ ప్లాన్ కోసం రూ.299, విద్యార్థి ప్లాన్ కోసం రూ.89 చెల్లించాలి. అలాగే 1,490కి వార్షిక వ్యక్తిగత ప్లాన్, రూ. 459కి త్రైమాసిక ప్లాన్, రూ.159కి నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ వంటి ఎంపికలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే యూట్యూబ్ ప్రీమయంలో కొన్ని ఉచిత ప్లాన్లు కూడా అమలవుతున్నాయి. ఇవి మూడు నెలలు, ఒక నెల కాలపరిమితితో ఉన్నాయి. గూగుల్ ఖాతాను ఉపయోగించి ఇప్పటి వరకూ యూట్యూబ్ ప్రీమియంను వినియోగించని వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.