YS Sharmila: చక్రం తిప్పిన కేవీపీ..! జగన్‌ను వ్యతిరేకించే నేతలతో షర్మిల మంతనాలు..!

వైఎస్ షర్మిలపై (YS Sharmila) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. షర్మిల ఎవరెవరిని కలుస్తున్నారు..? ఎవరితో మాట్లాడుతున్నారనే అంశాలపై ఆరా తీస్తోంది.
షర్మిల విజయవాడ పర్యటనపై స్పెషల్ బ్రాండ్, ఇంటెలిజెన్స్ పోలీసులు ఫోకస్ చేశారు. షర్మిల వద్దకు ఎవరు వెళ్తున్నారనే అంశానికి సంబంధించి డేటా తీస్తున్నారు.


ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను విభేదించిన నేతలతో షర్మిల టచ్‌లో ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్ఆర్‌తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. జగన్‌ను వ్యతిరేకించే వారు, బడుగు బలహీన వర్గాల నేతలను పార్టీలో చేర్చుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్లాలని హై కమాండ్ ఆమె దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.

వైఎస్ఆర్ ఆప్తమిత్రుడు కేవీపీ రంగంలోకి దిగినట్టు తెలిసింది. షర్మిల వెంట కేవీపీ ఉన్నారని, పలుకుబడి ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. కేవీపీ మరోసారి చక్రం తిప్పుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. వైఎస్ఆర్‌తో కలిసి నడిచిన నేతలను కేవీపీ తీసుకొస్తున్నారు. ఇప్పటి తరం నేతలతో షర్మిల మాట్లాడుతున్నారని తెలిసింది. పాత, కొత్త తరం నేతలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో షర్మిల బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని షర్మిల వర్గం నేతలు చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆమె ఏ మేరకు ప్రభావం చూపగలదో చూడాలి మరి.