రాష్ట్రంలో జికా వైరస్ కలకలం

www.mannamweb.com


నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు సమాచారం. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి పరీక్షలు నిర్వహించగా..

జికా వైరస్ నిర్ధరణ కావడంతో ఆ బాలుడిని చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యుల బృందం వెంకటాపురంలో పర్యటించనున్నారు.