CBSE 12వ తరగతి ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సావీ జైన్ 500లో 499 మార్కులతో దేశంలోనే టాపర్‌గా నిలిచింది. రోజుకు 4-5 గంటల పాటు చదివేదాన్నని, టాపిక్ అర్థం చేసుకోవడంపైనే దృష్టి పెట్టానని తెలిపింది.
తన విజయం తల్లిదండ్రులు, టీచర్లకు చెందుతుందని చెప్పింది. భవిష్యత్తులో IAS అధికారి కావాలనే లక్ష్యంగా కష్టపడుతున్నానంది. సావీ జైన్ తండ్రి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నారు.88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఉత్తీర్ణత 0.41% పెరిగిందని సీబీఎస్ఈ వెల్లడించింది. 1692794 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 1496307 మంది (88.39%) పాసయ్యారు. గతేడాది 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
బాలురు కంటే 5.94% ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 91.64 శాతం, బాలురు 85.70 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్‌జెండర్లు వంద శాతం పాస్‌కావడం విశేషం. గతేడాదితో పోలిస్తే బాలురు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ల ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2024లో బాలికలు 91.52, బాలురు 85.12, ట్రాన్స్‌జెండర్లు 50 శాతం ఉత్తీర్ణత సాధించారు.