733 Jobs : రైల్వే ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎదురు చూస్తున్నారా ? ఇది మంచి అవకాశం. రైల్వేలో 733 అప్రెంటిస్పోస్టుల భర్తీకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే ఈ నియామకం ఒప్పంద ప్రాతిపదికన జరగనుంది. అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగణంగా టెన్త్, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అత్యధికంగా ఫిట్టర్ పోస్టులు 187, ఎలక్ట్రీషియన్ పోస్టులు 137, కోపా (COPA) పోస్టులు 100, వైర్‌మెన్ పోస్టులు 80, పెయింటర్ పోస్టులు 42, కార్పెంటర్ పోస్టులు 38 ఉన్నాయి. వీటితో పాటు డ్రాఫ్ట్‌మెన్ (సివిల్) – 10, ఎలక్ట్రో మెకానిక్ – 5, మెషినిస్ట్ – 4, ప్లంబర్ – 25, మెకానిక్ (RAC) – 15, ఎస్ఎండబ్ల్యూ – 4, స్టెనో (ఇంగ్లీష్) – 27, స్టెనో (హిందీ) – 19, డీజిల్ మెకానిక్ – 12, టర్నర్ – 4, వెల్డర్ – 18, కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్ – 4, డిజిటల్ ఫొటోగ్రాఫర్ – 2 పోస్టులు(733 Jobs) ఉన్నాయి.
పై ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.టెన్త్, ఇంటర్, ఐటీఐల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాదిపాటు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు. అభ్యర్థులు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ https://www.apprentice shipindia.gov.in ద్వారా అప్లికేషన్ ఫామ్‌ను సమర్పించాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ ఏప్రిల్ 12.