ఏపీ కొత్త సియస్ నీరబ్ కుమార్ ప్రసాద్.. .. ఎవరు ఈ నీరబ్ కుమార్ ప్రసాద్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని ఏరుకోరి మరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు..
.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రెటరీగా అంటే సిఎస్ గా ఇన్నాళ్ళు జవహర్ రెడ్డి విధులు నిర్వహించారు. కొత్తగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడంతో చీఫ్ సెక్రెటరీగా ఉన్న జవహర్ రెడ్డిని బదిలీ చేసేసారు ఆయన ప్లేస్ లో చీఫ్ సెక్రెటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ఎంపిక చేశారు..
సీఎం గా జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికైనప్పుడు మొదట్లో సిఎస్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు.. జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయనను సిఎస్ గానే కొనసాగించుకున్నారు.. కానీ అదే ఏడాది నవంబర్ నెలలో ఆనాటి జగన్ సర్కార్ లో ఆ టైం లో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ కు ఎల్వి సుబ్రహ్మణ్యం కు పడేది కాదు.. దీంతో ఎల్వి సుబ్రహ్మణ్యం ను జగన్ గారే సిఎస్ పోస్ట్ నుంచి తప్పించి చారు ఆ తర్వాత నీరబ్ కుమార్ ను తాత్కాలిక సిఎస్ గా జగన్ గారు ఎంపిక చేసుకున్నారు.. అయితే ఈయనే పర్మనెంట్ చేస్తారని అందరూ ఊహించారు.. కానీ నీరబ్ కుమార్ గారి వ్యవహార శైలికి ఆయన పనితీరుకు జగన్ గారి వ్యవహార శైలికి ఆయన మనస్తత్వానికి సెట్ అవ్వలేదు.. దీంతో నీరబ్ కుమార్ ను తప్పించి మరి నీలం సాహిని గారికి సిఎస్ గా పదవీ బాధ్యతలు అప్పగించారు.. ఆమె తర్వాత జవహర్ రెడ్డికి సిఎస్ గా పదవి బాధ్యతలు జగన్ కట్టబెట్టారు..
వాస్తవానికి ఈ నీరబ్ కుమార్ గారి కంటే జవహర్ రెడ్డి గారు చాలా చాలా జూనియర్.. నీరబ్ కుమార్ గారు 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి జవహర్ రెడ్డి గారేమో 1990 బ్యాచ్ అధికారి సీనియారిటీ రీత్యా చూసుకున్న ఎక్స్పీరియన్స్ రీత్యా చూసుకున్న సిఎస్ పదవికి నీరబ్ కుమార్ గారే నూటికి నూరుతం అర్హులు.. నీరబ్ కుమార్ గారి వ్యవహార శైలి గురించి పద్ధతుల గురించి చంద్రబాబుకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది గతంలో ఆయన పలు సందర్భాల్లో ఎలా వ్యవహరించింది కూడా చంద్రబాబుకు బాగా తెలుసు.. నీరబ్ కుమార్ ప్రసాద్ గారు 1987 ఐఏఎస్ బ్యాచ్ ట్రైనీ కలెక్టర్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో యువ ఐఏఎస్ గా ఆనాడు అడుగు పెట్టారు.. శిక్షణానంతరం వేరే జిల్లాలో అంటే చిత్తూరు జిల్లాలో సబ్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలను తొలిగా స్వీకరించారు.. మరో ఐదేళ్ల తర్వాత అప్పటి కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మే 4వ తారీకు 1993 వ సంవత్సరంలో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.. ఆ హోదాలో ఆయన 1995 వ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తారీకు వరకు కూడా పని చేశారు… తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా కూడా పని చేశారు.. 2019 వ సంవత్సరం నవంబర్ నెల నుంచి 2022 వ సంవత్సరం ఫిబ్రవరి నెల వరకు కూడా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ చీఫ్ కమిషనర్ గా కూడా పని చేశారు.. అది కూడా కీలక శాఖ కావడంతో జగన్ సర్కారు ఆయనను దాని నుంచి కూడా తప్పించారు.. అసలు ప్రాధాన్యత లేని ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమించారు.. అప్పటి నుంచి ఆ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలనే నిర్వర్తిస్తూ ఉన్నారు..
ఇప్పుడు తాజాగా చంద్రబాబు సర్కారు రావడంతో ఆయనకు సిఎస్ గా ప్రమోషన్ దక్కింది.. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను సిఎస్ హోదాలో ఆయనే చూసుకున్నారు కూడా అయితే ఇక్కడే ఓ వింత పరిణామం చోటు చేసుకోబోతుంది.. వాస్తవానికి నీరబ్ కుమార్ గారికి జూన్ 30 వ తారీకుతో సర్వీస్ అయిపోతుంది.. అంటే ఆయన రిటైర్ కావాల్సి ఉందన్నమాట.. అంటే సరిగ్గా ఇంకా 18 రోజుల్లో ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వ్యక్తి అయితే ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు గారు ఆయనకే సిఎస్ పోస్ట్ ను ఇస్తూ చీఫ్ సెక్రెటరీగా బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..అయితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ వెసులుబాటు ఉంటుంది తమకు అవసరమైన ఐఏఎస్ అధికారులకు పదవి కాలాన్ని పొడిగించమనే హక్కు ఉంటుంది కేంద్రం కూడా ఆ రిక్వెస్టులను దాదాపుగా ఓకే చేస్తుంటాయి సేమ్ టు సేమ్ అలాగే ఈ నీరబ్ కుమార్ గారి పదవీ కాలాన్ని కూడా మరో ఆరు నెలల పాటు పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే చంద్రబాబు ఓ రిక్వెస్ట్ లెటర్ ను పంపించబోతున్నారు… మరి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సిఎస్ హోదాలో నీరబ్ కుమార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు ఏపీ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అన్నది….