Liver Health: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయక తప్పదు..

www.mannamweb.com


Liver Health: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయక తప్పదు..

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం వల్ల 80 శాతం ఎలాంటి జబ్బులు రావు. ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని అస్సలు తీసుకోవడం లేదు. అందుకే ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఇలా చాలా మంది కాలేయ సమస్యలతో కూడా బాధ పడుతున్నారు. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో..

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం వల్ల 80 శాతం ఎలాంటి జబ్బులు రావు. ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని అస్సలు తీసుకోవడం లేదు. అందుకే ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఇలా చాలా మంది కాలేయ సమస్యలతో కూడా బాధ పడుతున్నారు. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో లివర్ కూడా సహాయ పడుతుంది. లివర్ సరిగ్గా పనిచేయక పోతే శరీరంలో విష పదార్థాలు అనేవి పేరుకు పోతాయి. అదే విధంగా ఏవి పడితే అవి తినడం వల్ల లివర్‌లో కూడా కొవ్వు పేరుకుపోతుంది. దీంతో లేనిపోని దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పే ఆహారాలు లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, ఆరోగ్యంగా పని చేసేలా చేస్తాయి.

బీట్ రూట్:
బీట్ రూట్ తీసుకోవడం వల్ల శరీరంలోని చాలా భాగాలు ఎంతో ఆరోగ్యంగా పని చేస్తాయి. చర్మం, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. మీ డైట్‌లో బీట్ రూట్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. బీట్ రూట్ తినడం వల్ల ఒక్కటేంటి.. చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బీట్ రూట్ తినడం వల్ల లివర్ ఆరోగ్యం, పని తీరు మెరుగు పడుతుంది.

గ్రేప్ ఫ్రూట్:
గ్రేప్ ఫ్రూట్‌ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. గ్రేప్ ఫ్రైట్ అంటే పంపర పనస పండు. ఈ పండు తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది లివర్‌కి ఎంతో మంచి చేస్తుంది. లివర్‌లో వచ్చే మంట సమస్యను తగ్గించి.. ఒక షీల్డ్‌లా కాపాడుతుంది. కాలేయ డేంజరస్ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.

కాఫీ:
మితంగా తీసుకుంటే కాఫీతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కాఫీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. లివర్ సమస్యలతో బాధ పడేవారు తప్పకుండా కాఫీ తాగితే.. మంచి ఫలితం ఉంటుంది. లివర్ క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉంటుంది.

క్రూసిఫెరస్ కూరగాయలు:
క్రూసిఫెరస్ జాతికి చెందిన క్యాబేజీ, బ్రకోలీ, క్యాలీ ఫ్లవర్ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తీసుకోవడం వల్ల లివర్ డిటాక్స్ అవుతుంది. లివర్ ఆరోగ్యంగా పని చేసేందుకు శక్తిని అందిస్తాయి.