ఈ అర్హతలుంటే చాలు? కేంద్ర విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు మీవే.. నెలకు 1,20,000 జీతం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే వారి సంఖ్య ఏటా పెరిగిపోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే అభ్యర్థులు లక్షల్లో పోటీపడుతున్నారు.


జీతం తక్కువ ఉన్నా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకే ప్రియారిటీ ఇస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు యువత. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర విద్యుత్ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ డిగ్రీ/డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. జూన్‌ 26 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.30,000 – రూ.1,20,000 జీతం అందుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్య సమాచారం :

అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌) పోస్టులు : 20

అర్హత:

60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ డిగ్రీ/డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అర్హులు.
వయో పరిమితి:

30 ఏళ్లు మించకూడదు.
జీతం:

నెలకు రూ.30,000 – రూ.1,20,000 గా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:

రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌ సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:

ఆన్‌ లైన్‌
దరఖాస్తులకు చివరి తేదీ:

26-06-2024