Leftover Idli Recipes: ఇడ్లీలు మిగిలిపోయాయా..! ఇలా టేస్టీగా మసాలా ఇడ్లీలు తయారు చేసుకోండి.. రెసిపీ మీ కోసం..

www.mannamweb.com


టిఫిన్ అనగానే అందరి మదిలో ముందుగా గుర్తుకోచ్చేంది ఇడ్లి. దక్షిణాదిలో ఫేమస్ టిఫిన్ నేడు ఉత్తరాదిన మాత్రమే కాదు.. ప్రపచం వ్యాప్తంగా అడుగు పెట్టింది.

తెల్లగా చూడగానే ఆకర్షించే ఇడ్లి రుచిగా ఉంటుంది. దీనిని తినడం వలన బరువు అదుపు లో ఉంటుంది. తేలికగా జీర్ణం అవుతుంది. అందుకనే ఇడ్లీని చాలా మంది ఇష్టంగా తింటారు. దీని తయారీ కోసం ఉపయోగించే పదార్ధాలు మినపప్పు, వరి నూక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆవిరి మీద ఉడికించి తయారు చేసే ఇడ్లీని ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. ఇది బరువు తగ్గడంలో కూడా చాలా సహాయకారి అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఇడ్లీని సాంబారు, చట్నీ,కారం పొడి, నెయ్యి వేసుకుని ఎక్కువగా తింటారు. అయితే ఇడ్లీ తయారీ కోసం బయట తయారు చేసిన పిండికి బదులుగా ఇంట్లోనే ఇడ్లీ బ్యాటర్ ను రెడీ చేసుకోవచ్చు.

ఒక కప్పు మినప పప్పు తీసుకుని రాత్రి అంతా నానబెట్టాలి. మర్నాడు ఉదయం మినప పప్పుని శుభ్రం చేసి గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి. ఇపుడు ఆ మినప పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంతలో ఇడ్లి రవ్వను (బియ్యం నూక) తీసుకుని రెండు కప్పులు ఒక గిన్నెలో వేసుకుని నీరు వేసి శుభ్రం చేసుకుని ఇప్పుడు ఆ నూకలో నీరు లేకుండా గట్టిగా పిండి మినప పిండిలో వేసి కలుపుకోవాలి. అంతె ఇడ్లీ పిండి రెడీ అవుతుంది. ఈ పిండితో ఇడ్లీ, ఊతప్ప, లేదా మినప రొట్టె వంటి ఆహార పదార్ధాలను తయారు చేసుకోవచ్చు.

అయితే ఇడ్లీని టిఫిన్ గా తయరు చేసుకున్న తర్వాత కొన్ని సార్లు ఇంట్లో అందరూ తిన్నా ఇడ్లీలు మిగిలిపోతాయి. లేకా ఒకొక్కసారి చట్నీ లేదా సాంబారు అయిపోయి ఇడ్లీలు మిగిలిపోతాయి. అప్పుడు అలా మిగిలిన ఇడ్లీని ఎలా తినాలో అర్థం కాక కొంతమంది వాటిని పడేస్తారు. అయితే ఇలా మిగిలిపోయిన ఇడ్లీని మరింత రుచికరంగా చేసుకోవచ్చు. మిగిలిన ఇడ్లీతో రుచికరమైన వంటకం

కావాల్సిన పదార్ధాలు

జీలకర్ర
ఆవాలు
ఎండు మిర్చి
కరివేపాకు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కాప్సికమ్
క్యారెట్
టమాటాలు
పసుపు
ఉప్పు
నెయ్యి
సాంబార్ మసాలా పొడి
కొత్తిమీర

తయారీ విధానం: స్టవ్ మీద బాణలి పెట్టి లో నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ వేసి కాసేపు వేగనివ్వాలి. దీని తరువాత టమోటా ముక్కలు వేసి బాగా కలపాలి.. ఆపై ఉప్పు, పసుపు, తరువాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. బాగా వేయించిన తర్వాత మసాలా మిశ్రమానికి కొంచెం నీరు జోడించండి. కొంచెం సేపు ఈ మిశ్రమం ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇడ్లీని నాలుగు ముక్కలుగా కట్ చేసి, ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇడ్లీలపై తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన ఇడ్లీ రెడీ.