ఎలక్ట్రిక్ రైస్‌ కుక్కర్‌లో వండిన ఆహారం తింటే ఏం జరుగుతుందంటే..

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో టెక్నాలజీ మొత్తం మారిపోయింది. లైఫ్ స్టైల్ కూడా మారింది. మారుతున్న కాలంలో ఎవరికి వారు బిజీ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఎక్కువగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను ఉపయోగిస్తున్నారు.

ఇందులో అన్నం, బిర్యానీ చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో అన్నం వండటం చాలా సింపుల్. బియ్యం, నీళ్లు వేసి కుక్కర్ స్విచ్ ఆన్ చేస్తే చాలు. టైమ్‌కి అన్నం రెడీ అయిపోతుంది. అదే గ్యాస్ స్టవ్ మీద పెడితే పదే పదే వెళ్లి చూడాలి. సరిగ్గా చూడకపోతే.. అన్నం మెత్తగా అయ్యే ఛాన్సే కాకుండా మాడిపోతుంది కూడా. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ రైస్‌ కుక్కర్‌లో వండే అన్నం తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం మాత్రం మర్చిపోతున్నారు. ఎలక్ట్రిక్ రైస్‌ కుక్కర్‌లో వండిన అన్నం తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాన్సర్:

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అన్నం వండే పాత్ర అల్యూమినియం ఉపయోగిస్తున్నారు. దానికి తోడు కరెంట్ ద్వారా వండే అన్నం కాబట్టి.. క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువే ఉందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. కానీ తరచూ ఇందులో వండిన అన్నం తింటే మాత్రం చాలా జాగ్రత్త పడాలి.

మతి మరుపు:

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండే అన్నం తినడం వల్ల మతి మరుపు కూడా రావచ్చు. అల్యూమినియం పాత్రలో వండిన అన్నం తినడం వల్ల మెదడు పని తీరు అనేది మందగిస్తుంది. జ్ఞాపక శక్తి నశిస్తుంది. దీంతో మతి మరుపు అనేది పెరుగుతుంది.

కీళ్ల నొప్పులు వస్తాయి:

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల్లో కీళ్ల సమస్యలు కూడా ఒకటి. కాబట్టి ఈ అన్నం తింటే చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

జీర్ణ సమస్యలు:

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో రైస్ తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యలు రావచ్చు. అంతే కాకుండా డయాబెటీస్, గుండె సమస్యలు కూడా వస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)