సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 99లకే టికెట్స్.. ఆ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్..

www.mannamweb.com


ప్రస్తుతం టికెట్ రేట్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చిన్న చిన్న థియేటర్స్‌లో పర్లేదు కానీ మల్టీప్లెక్స్‌లు మాత్రం టికెట్ రేట్లతో ప్రేక్షకులను బెదరగొడుతున్నాయి.

ఫ్యామిలీతో కలిసి ఓ చూడాలంటే సామాన్యులు భయపడుతున్నారు. ఇక కొత్త లు రిలీజ్ అయ్యాయంటే చాలు సాధారణ టికెట్ పై దాదాపు 100 నుంచి 120 రూపాయిల వరకు పెంచేస్తున్నారు. దాంతో చాలా మంది థియేటర్స్‌కు వెళ్లి చూడటం కంటే ఓటీటీల్లో వచ్చినప్పుడు చూడటమే బెటర్ అనుకుంటున్నారు. ముఖ్యంగా బడా హీరోల లు వస్తే చాలు ఓపినింగ్స్ పెంచుకోవడానికి.. కలెక్షన్స్ చూపించుకోవడానికే మేకర్స్ మొదటి పదిరోజులు టికెట్ ధరలు పెంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు థియేటర్స్ యాజమాన్యాలు ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాయి.

కేవలం రూ. 99 టికెట్స్ అంటూ ఓ ఆఫర్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కానీ ఈ ఆఫర్ ఒక్క రోజు మాత్రమే.. కు నేషనల్‌ డేను పురస్కరించుకొని సెప్టెంబర్‌ 20న దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో టికెట్ ప్రైజ్ కేవలం రూ. 99 మాత్రమే ఉండనుంది. ఈమేరకు మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటన విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 4000కు పైగా థియేటర్లలో ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. కాగా ఐమ్యాక్స్‌, 4డీఎక్స్‌, రిక్లైనర్స్‌ ఉన్న థియేటర్స్ లో ఈ ఆఫర్ వర్తించదు. అలాగే పీవీఆర్‌ ఐనాక్స్, సినీపోలీస్‌, మిరాజ్‌, సిటీ ప్రైడ్‌, ఏషియన్‌, మూవీ టైమ్‌,డిలైట్‌ వంటి థియేటర్స్ లో ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది.. ఆ ఒక్క రోజు అన్ని షోలకు ఇది వర్తిస్తుందని అనౌన్స్ చేశారు.