ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. రజినికాంతా.. మజాకానా

www.mannamweb.com


ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా..! ఈ సామెతను ఇప్పుడు చేసి చూపించారు రజినీకాంత్. మామూలుగానే ఈయన ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు.. అందుకే ఒక్క సినిమాను ప్రమోట్ చేస్తే రెండు సినిమాలకు అది వర్కవుట్ అయిందిప్పుడు. ఇంతకీ రజినీ అంతగా ఏం చేసారో చూద్దాం పదండి..! కొందరు హీరోల సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లుంటేనే చాలు ప్రమోషన్ వచ్చేస్తుంది.

ప్రస్తుతం ఈయన వేట్టయన్ సినిమాతో అక్టోబర్ 10న రానున్నారు. వేట్టయన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 20న జరగనుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా స్పెషల్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదు మేకర్స్.

కానీ తాజాగా రజినీ ఈ బాధ్యత తీసుకున్నారు. కూలీ సెట్స్‌లో.. వేట్టయన్ సాంగ్‌కు డాన్స్ వేసారు.. దాంతో దెబ్బకు సినిమా ట్రెండ్ అవుతుందిప్పుడు. లోకేష్ కనకరాజ్ సినిమా లొకేషన్స్‌లో మనసిలాయో అంటూ మాస్ స్టెప్పులు వేసారు రజినీ.

అంతే.. ఇటు కూలీతో పాటు.. అటు వేట్టయన్ గురించి మాట్లాడేసుకుంటున్నారు నెటిజన్లు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే కాబోలు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో కాకుండా.. బయటి కథతో వస్తుంది కూలీ. 2025లో విడుదల కానుంది ఈ చిత్రం.