రోటి పచ్చళ్లకు ఉండే రుచే వేరు. వేడి వేడి అన్నంలో కొద్దిగా రోటి పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ అన్నంలో నెయ్యి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.
ఈ రోటి పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. అందులోనూ ఇప్పుడు చింత చిగురు అంటే చాలా మందికి ఇష్టం. చింత చిగురు పప్పు, చికెన్, మటన్, ఇతర కూరగాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అందులోనూ చింత చిగురు, ఎండు మిర్చి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే కనీసం మూడు రోజులన్నా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి పుల్లగా, కారంగా ఉంటుంది. మరి ఈ చింత చిగురు, ఎండు మిర్చి పచ్చడి ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత చిగురు ఎండుమిర్చి రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
చింత చిగురు, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, మెంతులు, ఉప్పు, టమాటాలు, ఉల్లిపాయ, ఆయిల్, తాళింపు దినుసులు.
చింత చిగురు ఎండుమిర్చి రోటి పచ్చడి తయారీ విధానం:
ముందుగా చింత చిగురు బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టాలి. ఈ నూనెలో ముందుగా ఎండు మిర్చి వేసి వేయించాలి. ఇవి వేగాక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతుల వేసి ఒకసారి వేయించాలి. ఆ నెక్ట్స్ వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరు శనగ కూడా వేసి వేయించాలి. నెక్ట్స్ వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టిన చింత చిగురు కూడా వేసి ఒక సారి వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి కాస్త దగ్గరగా అయ్యాక తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత రోట్లో ఒక్కొక్కటీ వేస్తూ బాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఈ పచ్చడికి తాళింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఎండు మిర్చి, చింత చిగురు రోటి పచ్చడి సిద్ధం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.