కొరటాల ఏంటిది? ఇంత దారుణమైన తప్పులు ఏంటి సార్

www.mannamweb.com


దాదాపు ఆరేళ్ళ తర్వాత సింగిల్ గా వచ్చిన ఎన్టీఆర్ సినిమా హిట్టు కొట్టేసిందనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్టు కొట్టినప్పటికీ కొన్ని కొన్ని సన్నివేశాలు ఏంట్రా బాబు ఈ సినిమా అనేలా ఉంది..

అసలు ఆ సన్నివేశాలు ఏంటి? కొరటాల శివ దర్శకత్వంలో మళ్లీ ఏం తప్పులు జరిగాయి అనేది తెలుసుకుందాం..

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరకు అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, రత్నవేలు సినెమాటోగ్రపీ ప్లస్ అవుతే విఎఫ్ఎక్స్, అయన తీసిన విధానం మైనస్ అయ్యాయి.. అచ్చం ఇలానే ఆచార్య సినిమాలోను విఎఫ్ఎక్స్ ఎంత మైనస్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.. ఇక అలానే ఎన్టీఆర్ దేవరకు కూడా విఎఫ్ఎక్స్ నష్టం లేకపోలేదు.. ఆ సినిమాలో అలా జరిగినప్పటికీ ఆతర్వాత తీసిన ఈ ఛాలెంజింగ్ సినిమాలో అదే తప్పు చెయ్యడం కొరటాల అభిమానులకు ఒకింత షాకిచ్చిందనే చెప్పాలి.

ఇకపోతే జాన్వీ కపూర్ అభిమానులకు భారీ షాక్ తగిలింది.. శ్రీదేవిపై అభిమానంతోనే సగంమంది ప్రేక్షకులు సినిమాకు వెళ్తుంటారు.. కానీ అక్కడ జాన్వీ కపూర్ ఏదో పాటకు వచ్చి డ్యాన్స్ వేసి వెళ్లే డ్యాన్సర్ లా ఉంది కానీ హీరోయిన్ గా ఎక్కడ కనిపించలేదు.. ఇక జాన్వీ కపూర్ కు ఎన్టీఆర్ కు మధ్య జరిగే సన్నివేశాల్లో కూడా కెమిస్ట్రీ కుదరలేదు.. అందుకే జాన్వీ కపూర్ కోసమే సినిమాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు డిసప్పాయింట్ మెంట్ తప్పదు..

సినిమాలో ఊహించని ట్విస్టులు పెట్టి అభిమానులను అల్లాడించేసిన కొరటాల శివ క్లైమాక్స్ దగ్గరకు వచ్చే సరికి పెద్ద షాక్ ఇచ్చాడు.. బాహుబలి సినిమా రేంజ్ లో క్లైమాక్స్ పెట్టడానికి ప్రయత్నించిన కొరటాల శివ బొక్కబోర్లా పడ్డాడు అనే చెప్పాలి.. క్లైమాక్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డిసప్పాయింట్ మెంట్ తప్పదు.. అలాగే సినిమా పార్ట్ 2 కోసం పార్ట్ 1 ను దారుణంగా సాగదియ్యడం అస్సలు బాగాలేదు.. ఒక్క ఈ సినిమానే కాదు పార్ట్ 1, పార్ట్ 2 అని వస్తున్న ప్రతి సినిమాల్లో ఈ సమస్య లేకపోలేదు.. ఇక్కడ ఐరనీ ఏంటంటే పెద్ద స్టార్ హీరోల సినిమాలు అన్ని 2 పార్ట్శ్.. 3 పార్ట్శ్ ఉండడం. ఏది ఏమైనా జాన్వీ కపూర్ కోసం సినిమాకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ మెంట్ తప్పదు.