వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే

www.mannamweb.com


ఇటీవలే దేవర తో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

మాస్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ లు బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ తర్వాత తారక్ వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు తారక్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఎన్టీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మూవీతో నార్త్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ఇప్పుడు వార్ 2 తో మరోసారి బీటౌన్ ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే ఇదివరకే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న తారక్.. ఇప్పుడు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ లో తారక్ లుక్ నెట్టింట వైరలవుతుంది.

ఈ చిత్రంలో తారక్ స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ రోల్ పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై వార్ 2 ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కనీసం ఈ గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ మూవీలో తారక్ లుక్ గురించి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫోటోస్ లీక్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఎవరో తీసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో తారక్ బ్రౌన్ కలర్ టీ షర్ట్, ఆర్మీ షర్ట్ వేసుకుని నడుస్తూ కనిపిస్తున్నారు. మాస్ లుక్ లో ఎన్టీఆర్ వేరేలెవల్లో ఉన్నారంటూ ఫ్యాన్స్ ఆ ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు.

వార్ 2లో తారక్ లుక్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ చూసేందుకు ఇటు టాలీవుడ్ అడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ చేయనున్నారు.