మహిళలకు శుభవార్త, ఆ రెండు పథకాలపై అప్డేట్.. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ హైలైట్స్

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.2.94 లక్షలు.. లైవ్ అప్డేట్స్
* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
* సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
* నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం
* నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత
* రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
* రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది
* రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది
* గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారు
* రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
* మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
* రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు
* ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు
* జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
* జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం
* ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు
* ఎస్టీ సంక్షేమం – రూ.7,557 కోట్లు
* బీసీ సంక్షేమం – రూ.39,007 కోట్లు
* మైనార్టీ సంక్షేమం – రూ.4,376 కోట్లు
* మహిళ, శిశుసంక్షేమం – రూ.4,285 కోట్లు
* ఉన్నత విద్య – రూ.2,326 కోట్లు
* ఆరోగ్యరంగం – రూ.18,421 కోట్లు
* పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి – రూ.16,739 కోట్లు
* పట్టణాభివృద్ధి – రూ.11,490 కోట్లు
* గృహ నిర్మాణం – రూ.4,012 కోట్లు
* నైపుణ్యాభివృద్ధి శాఖ – రూ.1,215 కోట్లు
* పాఠశాల విద్యాశాఖ – రూ.29,909 కోట్లు
* జలవనరులు – రూ.16,705 కోట్లు
* పరిశ్రమలు, వాణిజ్యం – రూ.3,127 కోట్లు
* ఇంధనరంగం – రూ.8,207 కోట్లు
* రోడ్లు, భవనాలు – రూ.9,554 కోట్లు
* యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ.322 కోట్లు
* పోలీసు శాఖ – రూ.8,495 కోట్లు
* పర్యావరణం, అటవీశాఖ – రూ.687 కోట్లు
* 192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు..
* విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడమే స్కిల్ ఇంటర్నేషనల్ లక్ష్యం

అంతకముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచారు. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను రెండుసార్లు ఆమోదింపజేసుకొని నిధులు ఖర్చు చేస్తున్నారు. సుమారు రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతకముందు 2024-25 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ హైలైట్స్ ఇలా ఉన్నాయి.