ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ సంఘటన(Bad incident) చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి.. తగలబెట్టిన దారుణ సంఘటన వెలుగు చూసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా(Nandyala District) నందికొట్కూరు బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రేమిస్తున్నానని ఓ యువకుడు వెంటపడేవాడు. అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. విద్యార్తిని లహరి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.
అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో చనిపోయినట్లు తెలుస్తుండగా.. ఘటనకు సంబంధించిన విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.