ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం..

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పుల చేయనుంది. అదేవిధంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు.

తాము కేవలం సెకండియర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల ఎత్తివేతకు సంబంధించి ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు సూచనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశ పెడుతున్నామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.