రేషన్ కార్డు ఉన్న యువతకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.4 లక్షలు?

www.mannamweb.com


ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏపీలో కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తాజాగా మరో కీలక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి సృష్టించడానికి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించడానికి దరఖాస్తులు స్వీకరించడం మొదలైంది. దీనికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. దరఖాస్తు చేసేటప్పుడు రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలతో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత, సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. ఈ రుణాలపై 50% రాయితీ అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన కులాల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి దిశగా పలు చర్యలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా, వివిధ సామాజిక వర్గాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా, ఆర్థిక సాయం అందించి, స్వయం ఉపాధిని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకంలో, బీసీ వర్గాలకు చెందిన వారికి, అగ్రవర్ణాల పేదలకు (ఈడబ్ల్యూఎస్ వర్గాలు) రుణాలు అందించడం మొదలైంది. బీసీ వర్గాల సేవా సహకార సంస్థ ద్వారా రూ.25.6 కోట్ల విలువైన పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాలు బ్యాంకు లింకేజీతో రాయితీ రుణాల రూపంలో అందించబడతాయి.

మొదటి శ్లాబ్ కింద యూనిట్ విలువ రూ.2 లక్షలకు లోపుగా ఉంటుంది. ఇందులో 75 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తారు. రెండో శ్లాబులో యూనిట్ విలువ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.25 లక్షల రూపాయల రాయితీ ఉంటుంది. మూడో శ్లాబ్ కింద యూనిట్ విలువ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 2 లక్షల రూపాయల రాయితీ ఇవ్వనున్నారు.
డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ కోర్సులు చేసిన నిరుద్యోగ బీసీ యువతకు జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి రుణాలు అందిస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.8 లక్షల వరకు ఖర్చు కానుంది, ఇందులో 50% అంటే రూ.4 లక్షలు రాయితీ రూపంలో అందించనున్నారు. మిగిలిన రూ.4 లక్షలు బ్యాంకు రుణంగా ఇవ్వబడతాయి. అగ్రవర్ణ పేదలకు (ఈబీసీలు) కూడా స్వయం ఉపాధి పథకాలు అందించబోతున్నారు. ఇందులో కూడా 50% రాయితీ ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకాలకు అర్హత వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత, స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది.