ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) నాయకత్వం వహిస్తున్న జనసేన పార్టీ(Janasena party)కి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) భారీ శుభవార్త చెప్పింది.
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన చేరింది. జనసేనకు గాజుగ్లాసు గుర్తు రిజర్వ్ చేస్తూ మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖ పంపింది. కాగా, ఇటీవలే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదన మేరకు మేరకు మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం(Pithapuram)లో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ సిద్ధాంతాలు, పవన్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరించడంతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని కమిటీ భావించింది. ఇందుకోసం పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనల, సలహాలు తీసుకోవాలని, ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ప్లీనరీ(Janasena Plenary) సమీపిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

































