Gold and Silver prices today : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు..

ఈరోజు బంగారం, వెండి ధరలు: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. ఫిబ్రవరి 8న మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ చూడండి..


మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

శనివారం దేశంలో బంగారం ధరలు మరింత తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 10 తగ్గి రూ. 86,500కి చేరుకుంది. అంతకుముందు రోజు.. ఈ ధర రూ. 86,510. అదే సమయంలో, 100 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 8,65,000కి చేరుకుంది. 1 గ్రాము బంగారం ధర రూ. 8,650.

మరోవైపు, 10 గ్రాముల బంగారం (22 క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి రూ. 79,290కి చేరుకుంది. శుక్రవారం, ఈ ధర రూ. 79,300. 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 7,92,900కి చేరుకుంది. ప్రస్తుతం 1 గ్రాము బంగారం ధర రూ. 7,929గా ఉంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో శనివారం కూడా బంగారం ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,290. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,500. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 79,290. 24 క్యారెట్ల బంగారం .. 86,500. ముంబై, బెంగళూరు, కేరళలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,290, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,500గా ఉంది. పూణేలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,290, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,500.

ఈరోజు బంగారం ధర హైదరాబాద్: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,290. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,500. విజయవాడలో కూడా ఈ ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఇలాగే ఉన్నాయి.

అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,340, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,550. భువనేశ్వర్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,290, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,500.

ఆర్‌బిఐ వడ్డీ రేటు తగ్గింపులు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు.

వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శనివారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,940. కిలో వెండి రూ. 100 తగ్గి రూ. 99,400కి చేరుకుంది. శుక్రవారం ఈ ధర రూ. 99,500.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,06,900. కోల్‌కతాలో వెండి ధరలు రూ. 99,400.. చెన్నైలో రూ. 99,400.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.