BSNL ఒకే రీఛార్జ్‌తో మొత్తం కుటుంబానికి అద్భుతమైన ప్రయోజనాలు

కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త! ఒకే రీఛార్జ్‌తో మొత్తం కుటుంబానికి అద్భుతమైన ప్రయోజనాలు


ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం ఒక గ్రేట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ ద్వారా కస్టమర్ల రీఛార్జ్ ఖర్చును గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను తీసుకువచ్చారు. ఈ ప్లాన్‌లో ఒకే రీఛార్జ్‌తో మూడు సిమ్‌లను కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబ సభ్యులందరికీ ఒకేసారి లాభాలు లభిస్తాయి. ఇంకా వివరాలు తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ రూ.798 రీఛార్జ్ ప్లాన్:
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు రూ.798 పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే, అదనంగా రెండు సిమ్‌లను జోడించుకునే అవకాశం ఉంటుంది. అంటే, ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు వేర్వేరుగా రీఛార్జ్ చేయనవసరం లేదు. ఈ ప్లాన్‌లో మూడు సిమ్‌లకు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్, 50GB డేటా మరియు రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స అకౌంట్‌లో ప్రకటించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందడానికి వెంటనే రీఛార్జ్ చేసుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.