ఆకాశం నుండి చేపల వర్షం కురిసింది.. రోడ్డు మొత్తం చేపలతో నిండిపోయింది

ఎండాకాలం ముగిసిపోకముందే భారతదేశవ్యాప్తంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్నిచోట్లనైతే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.


భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నాయి. కొన్నిచోట్లనైతే ఆకస్మాత్తుగా వర్షాలు కురిసి పంటలు కూడా నీట మునుగుతున్నాయి. ఇటీవల ఏర్పడిన తుఫాను కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని కొంతమంది వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం సమయంలో కూడా కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా పోస్ట్ చేసిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి. తాజాగా వర్షానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో వర్షానికి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. గతంలో ఆకాశం నుంచి వర్షంతో పాటు కోళ్లు పడడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చూసి ఉంటాం. తాజాగా ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ గా మారింది. వర్షాకాలం కొన్నిచోట్ల చేపలు పడడం మనం తరచుగా వార్తలలో చూసి ఉంటాం. కానీ కేవలం చిన్నచిన్న చేపలు మాత్రమే ఆకాశం నుంచి పడుతూ ఉంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో పెద్ద పెద్ద చేపలు ఆకాశం నుంచి పడుతూ ఉన్నాయి.

వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ఒక స్ట్రీట్‌లో ఆగి ఉన్న కార్లపై ఆకాశం నుంచి విచ్చలవిడిగా చేపలు పడుతూ ఉంటాయి. ఇందులో చాలా పెద్ద పెద్ద చేపలు ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా కొన్ని చేపలు పైనుంచి పడి గిలాగిలా కొట్టుకోవడం మీరు చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోను ఇదేందిరా మామ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీటిని చూసి ఆశ్చర్యపోయిన సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.