వైసీపీ సంచలనం.. విజయసాయిరెడ్డి రహస్య మంతనాల వీడియో బయటపెట్టిన వైసీపీ

వైసీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది విజయసాయిరెడ్డికి సంబంధించిన ఒక వీడియో లీక్ అవ్వడమే. ఈ వీడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.


అసలు ఈ వీడియోలో ఏముంది? ఎందుకు ఇది ఇంతలా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది? టీడీపీ నేతలతో విజయసాయిరెడ్డి ఏం చర్చించారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే, మనం ఈ వ్యవహారంలోకి లోతుగా వెళ్లాల్సిందే!

విశ్వసనీయ వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రహస్య సమావేశం మద్యం కుంభకోణంలో విచారణ జరగడానికి ముందు జరిగిందట. విజయసాయిరెడ్డి తాడేపల్లిలోని పార్క్ విల్లాలో ఉన్న విల్లా నంబర్ 27కు వెళ్లారు. ఆ తర్వాత కేవలం 13 నిమిషాల్లోనే టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వీరిద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు అత్యంత గోప్యంగా చర్చలు జరిగాయని సమాచారం. ఈ మీటింగ్‌లో ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అసలు విషయం ఏమిటంటే, ఈ రహస్య మీటింగ్ జరిగిన వెంటనే విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ తమ సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే, ఒకవైపు రహస్యంగా టీడీపీ నేతలతో మంతనాలు జరిపి, మరోవైపు బహిరంగంగా తమ పార్టీని విమర్శించారని వారి ఆవేదన. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఈ ఆరోపణలు మాత్రం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.