ఖరీఫ్ పంట 2025 కు రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర వాటా 50% సమానమైన వాటాను ముందస్తు ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి.. పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 132 కోట్ల 58 లక్షల నిధులు విడుదలు చేసింది.ఖరీఫ్ పంట 2025 కు రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర వాటా 50% నిధులు విడుదలయ్యాయి.
ముందస్తు ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి ఈ నిధులు వినియోగించనున్నారు. పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.132 కోట్ల 58 లక్షల నిధులు విడుదల చేసింది.రూ. 132 కోట్ల 58 లక్షల నిధుల విడుదలరాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులను ముందస్తు ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి వినియోగించనున్నారు. దీంతో రైతులు సకాలంలో పంట బీమా సౌలభ్యం పొందగలుగుతారు. ఈ పథకం కింద ఖరీఫ్ పంటలకు రైతులు కేవలం 2 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది…మిగిలిన భాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో భరిస్తాయి. ఈ నిధుల విడుదలతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఆర్థిక రక్షణ కల్పించడంలో తన నిబద్ధతను చాటుకుంది. ఈ 132 కోట్ల 58 లక్షల రూపాయల నిధుల విడుదలతో ఏపీలోని లక్షలాది రైతులు ఖరీఫ్ 2025 సీజన్‌లో పంట బీమా సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు.
































