12 పెళ్లిళ్ల చేసుకోవడంపై నిత్య పెళ్లికూతురు క్లారిటీ

నిత్య పెళ్లికూతురు ఆరోపణలపై స్పందించారు నీలిమ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ తాను నిత్య పెళ్లికూతురిని కాదని, 12 పెళ్లిళ్లతో మోసం చేసినట్లు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని తెలిపింది.


తప్పుడు ప్రచారాలపై రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేశాను. న్యాయం కోసం రాజకీయ నాయకులను ఆశ్రయించినా ఫలితం లేదని, నిజం తేల్చే వరకు పోరాటం చేస్తానని పేర్కొంది.

కాగా నిత్య పెళ్లికూతురిపై కేసు నమోదు అయింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన నీలిమ.. 12 పెళ్లిళ్లు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్‌గా చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటుందట. బాధితుల నుంచి అందినకాడికి దోచుకుని, తిరగబడితే తిరిగి వారి మీదే వేధిస్తున్నారంటూ కేసులు కూడా పెట్టారు. అయితే నిత్య పెళ్లికూతురు ఆరోపణలపై స్పందించారు నీలిమ. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని తెలిపింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.