జస్ట్ రూ. 2500తో ఈ కోర్సు నేర్చుకుంటే చాలు నెలకు రూ. 1 లక్ష రూపాయలు సంపాదించే ఛాన్స్..

మీరు కేవలం 2500 రూపాయలతోనే నెలకు లక్ష రూపాయలు సంపాదించగలిగే కోర్సు నేర్చుకోవాలి అనుకుంటున్నారా అయితే అలాంటి కోర్సు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పైగా ఈ కోర్సు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ ద్వారా సర్టిఫికెట్ తో సహా అందిస్తున్న కోర్స్ అని తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగక తప్పదు. మార్కెట్లో ప్రస్తుతం ఈ కోర్సు నేర్చుకొని వ్యాపారం ప్రారంభించినట్లయితే ప్రతినెలా 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత కాలంలో ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం చేసుకునే వారికి ఎక్కువగా ఆదాయం లభిస్తుంది అని చెప్పవచ్చు. నిజానికి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ కల్పించడంతో పాటు, రుణాలను సైతం మంజూరు చేసినట్లయితే సొంత కాళ్ళ పైన నిలబడేందుకు ఆస్కారం లభిస్తుంది. . ప్రస్తుత కాలంలో వ్యాపార రంగంలో అనేక అవకాశాలు భారీగా పెరిగాయి అని చెప్పుకోవచ్చు. మారుతున్న జీవనశైలికి తగ్గట్టుగా వ్యాపారాలు కూడా కొత్త కొత్తవి మార్కెట్లోకి వస్తున్నాయి. మీరు కూడా అలాంటి వ్యాపారాలను చేయాలి అనుకున్నట్లయితే చక్కటి ఉపాధి శిక్షణ పొందితే మంచిది. ఉపాధి శిక్షణ ద్వారా మీరు ఏ రంగంలో అయితే స్థిరపడాలి ఆదాయం పొందాలి అనుకుంటున్నారో ఆ రంగానికి చెందినటువంటి వృత్తి విద్యను నేర్చుకొని మీరు స్థిరపడవచ్చు. ప్రస్తుతం అలాంటి వృత్తి విద్య గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ఈ మృతి విద్య నేర్చుకోవడం ద్వారా మీరు ప్రతి నెల లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో భద్రత అనేది అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. ప్రధానంగా దొంగల బెడద నుంచి తప్పించుకోవడానికి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించడానికి. సురక్షితమైన సర్విలెన్స్ కోసం సీసీటీవీ లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ లేదా సీసీటీవీ అనేది ఇప్పుడు అత్యవసరంగా మారింది అని చెప్పవచ్చు. ప్రధానంగా సిసిటీవీ లను భద్రత కోసం చాలా ముఖ్యంగా వినియోగిస్తున్నారు. వ్యాపార వర్గాలు కూడా సీసీటీవీలను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా తమ ఆఫీసుల్లోనూ, వ్యాపార స్థలాల్లోనూ, గోడౌన్లలోను సీసీటీవీ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలావరకు ఆఫీసుల్లో ఎంప్లాయిస్ పనితీరును సీసీటీవీ ల ద్వారా పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు సీసీటీవీలను ఎక్కువగా గొడవలలో సరుకు దొంగతనం జరగకుండా కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే భద్రతకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా పబ్లిక్ స్థలాల్లోనూ, ప్రైవేటు స్థలాల్లోనూ, జన సమర్థత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలుకు డిమాండ్ భారీగా పెరిగింది అని చెప్పవచ్చు.
దీన్నే మీరు ఒక ఉపాధి అవకాశంగా మార్చుకునే వీలుంది. CCTV INSTALLATION & SERVICING కోర్సు నేర్చుకోవడం ద్వారా యువకులు చక్కటి ఉపాధి మార్గం పొందే వీలుంది. అవును మీరు వింటున్నది నిజమే అయితే ఈ కోర్సును కేవలం 2500 రూపాయలకు మాత్రమే నేర్చుకోవచ్చు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని సెట్విన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువతకు పలు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు అందిస్తోంది. అంతేకాదు ఉపాధి శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లను సరితం జారీచేస్తుంది. సెట్విన్ సంస్థలో కేవలం 2500 రూపాయలకే CCTV INSTALLATION & SERVICING కోర్సు నేర్పిస్తున్నారు. ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా మీరు చక్కటి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీరు సీసీ కెమెరాల దుకాణం పెట్టుకోవచ్చు. అలాగే సీసీటీవీ సర్వీసింగ్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాలు, చిన్న నగరాల్లో కూడా సీసీటీవీలకు గిరాకీ బాగా పెరిగింది. కనుక మీరు ఇందులో చక్కటి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్ ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు  పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.