చపాతీ మృదువుగా, మెత్తగా రావాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ ఒక్కటి వేసి చూడండి!

దయం పూట వంటింటి హడావిడి అంతాఇంతా కాదు. గృహిణులు తెల్లారేలేచి పని మొదలు పెట్టినా.. పిల్లలు, భర్తకు కడుపు నిండా ఒంటి పెట్టి, వారిని వేళకు బయటకు పంపడం ఓ పెద్ద టాస్కే.


ఇక ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌కి ఇడ్లీ, దోస అంటే చిటికెలో అయిపతాయి కానీ.. చపాతీ అంటే మాత్రం పరుగులు తీయాల్సిందే. అతి పెద్ద సమస్య ఏమిటంటే చేసిన చపాతీలు త్వరగా గట్టిపడతాయి. రోజూ చపాతీలు తినే వారి ఇళ్లలో కూడా ఈ రకమైన సమస్య ఉంటుంది. చపాతీలు తయారు చేసిన తర్వాత కొన్ని నిమిషాల వరకే మృదువుగా ఉంటాయి. ఆ తర్వాతఅవి తినడానికి పనికి రాకుండా గట్టిపడిపోతాయి. చపాతీ మృదువుగా రావాలంటే ఓ చిన్ని ట్రిక్‌ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. ఇలా చేప్తే 24 గంటలు చపాతీలను మృదువుగా ఉంటాయి. అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం..

చపాతీ పిండిని ఎలా తయారు చేయాలంటే?

చపాతీని మృదువుగా చేయడానికి, ముందుగా చపాతీ పిండిని తీసుకొని దానికి కొద్దిగా నీరు, పాలు, ఒక చెంచా నూనె లేదా నెయ్యి వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. వీటిని జోడించడం వల్ల పిండి మృదువుగా ఉంటుంది. అలాగే పాలలోని ప్రోటీన్లు తేమను నిలుపుకుంటాయి. ఇది చపాతీ త్వరగా గట్టిపడకుండా చేస్తుంది. కలిపిన వెంటనే పిండిని పిసికి చపాతీ చేయకూడదు. తడిగా ఉన్న గుడ్డ తీసుకొని దానిపై 20 నుంచి 30 నిమిషాలు పిండి ముద్దపై కప్పి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల దానిలోని గ్లూటెన్ వదులుగా మారుతుంది. అది నీటిని పూర్తిగా గ్రహిస్తుంది. దీనివల్ల పిండి మృదువుగా మారి, కలుపుకోవడం సులభం అవుతుంది. అంతే కాదు పాన్ మీద ఉంచినప్పుడు కూడా బాగా ఉబ్బుతుంది.

రోటీ పాన్ మీద పైకి ఉబ్బి లేచినప్పుడు, ఆవిరి నిండి పొరలా ఏర్పడుతుంది. ఇది చపాతీని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. కానీ చపాతీని పాన్ నుంచి త్వరగా తీసివేయవద్దు. అలాగని ఎక్కువసేపు ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల చపాతీ గట్టిగా మారిపోతుంది. రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి వచ్చి బెలూన్ లాగా ఉబ్బినప్పుడు, చపాతీని పాన్ నుంచి తీసివేయాలి.

చపాతీ మృదువుగా రావాలంటే ఏం చేయాలి?

చేసిన చపాతీలను అలాగే బయట ఉంచకుండా, శుభ్రమైన కాటన్ వస్త్రంలో కప్పి ఉంచాలి. ఇది అదనపు తేమను గ్రహిస్తుంది. చపాతీలు చాలా త్వరగా ఎండిపోకుండా నిరోధిస్తుంది. తరువాత వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయాలి. ఇలా చేయడం ద్వారా మనం తయారుచేసే చపాతీలు గంటల తరబడి మృదువుగా ఉంటాయి. మీరు వాటిని భోజనానికి కూడా తీసుకెళ్లవచ్చు. సుదీర్ఘ ప్రయాణంలో కూడా తీసుకెళ్లవచ్చు. అంతే కాదు ఈ ఉదయం తయారు చేసి మరుసటి రోజు ఉదయం వరకు కూడా తినవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.