మీరు 7వ తరగతి పాసయ్యారా.. నెలకు రూ.44 వేల జీతం.. ఆంధ్రప్రదేశ్‌ జిల్లా కోర్టులో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

 మీరు 7వ తరగతి పాసయ్యారా. అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ఆంధ్రప్రదేశ్‌లోని(AP District Court Jobs) పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులోని వివిధ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతోంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 12 వరకు కొనసాగనుంది. కాబట్టి, అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ westgodavari.dcourts.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు, ఖాళీల వివరాలు:

  • హెడ్‌ క్లర్క్ పోస్టులు 03
  • జూనియర్ అసిస్టెంట్ కమ్-టైపిస్ట్ పోస్టులు 03
  • స్టెనో కమ్-టైపిస్ట్ పోస్టులు 02
  • అటెండర్ పోస్టులు 03

విద్యార్హతలు:
పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతన వివరాలు;
వివిధ విభాగాలను బట్టి వేతనాల్లో మార్పులు ఉన్నాయి.

  • హెడ్‌ క్లర్క్: రూ.44,570
  • జూనియర్ అసిస్టెంట్ కమ్-టైపిస్ట్: రూ.25,220
  • స్టెనో కమ్-టైపిస్ట్: రూ.34,580
  • అటెండర్: రూ.20,000.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.